Electronics Warranties: సాధారణంగా కొత్తగా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా టీవీ కొనేటప్పుడు షాప్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ ఎక్స్‌ట్రా వారెంటీ తీసుకోమని చెబుతుంటారు. డివైస్ పాడైతే రిపేర్ ఖర్చులు తగ్గుతాయని, పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని అంటారు. కానీ, ప్రతిసారి ఎక్స్‌ట్రా వారెంటీ తీసుకోవడం అవసరం ఉండకపోవచ్చు. కాస్త తెలివిగా ప్లాన్ చేసుకుంటే ఆ అదనపు డబ్బును ఖర్చు చేయకుండానే మీ డివైస్‌ను కవర్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఎక్స్‌ట్రా డబ్బులు పెట్టి రిటైలర్ వారెంటీ తీసుకునే బదులు, మంచి కంపెనీ నుంచి సరైన స్టాండర్డ్ వారెంటీ ఉన్న ప్రొడక్ట్‌ను ఎంచుకోవడం మంచిది. కొన్ని ల్యాప్‌టాప్ బ్రాండ్లు అదనపు ఖర్చు లేకుండానే ఎక్కువ కాలం వారెంటీ ఇస్తున్నాయి. సాధారణంగా కంపెనీ ఇచ్చే వారెంటీ చాలాసార్లు సరిపోతుంది. అవసరం ఉంటేనే అదనపు కేర్ ప్లాన్ గురించి ఆలోచించండి.
Also Read: USB-A To USB-C కేబుల్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యమేనా? టెక్ నిపుణులు ఏం చెబుతున్నారంటే!
వారెంటీ ఒక్కటే మనకు ఉన్న రక్షణ కాదు. కొన్ని క్రెడిట్ కార్డులు, పేమెంట్ సర్వీసులు కొనుగోళ్లపై అదనపు ప్రొటెక్షన్ లేదా వారెంటీ ప్రయోజనాలు అందిస్తాయి. అలాగే ప్రొడక్ట్‌లో లోపం ఉంటే రిటర్న్ లేదా రీప్లేస్‌మెంట్ పాలసీని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇవి కార్డు, సర్వీస్, విక్రేత నిబంధనలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి.. ముందే చెక్ చేసుకోవడం మంచిది.
చిన్న సమస్య వచ్చిందని వెంటనే ఖరీదైన వారెంటీ అవసరం అనుకోవాల్సిన పనిలేదు. కొన్ని సింపుల్ రిపేర్లకు ఆన్‌లైన్‌లో స్టెప్-బై-స్టెప్ గైడ్స్, రిపేర్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అయితే క్లిష్టమైన సమస్యలు ఉంటే నిపుణులనే సంప్రదించడం మంచిది. మొత్తంగా.. ప్రొడక్ట్ కొనేటప్పుడు కంపెనీ వారెంటీ, రిటర్న్ పాలసీ, పేమెంట్ ద్వారా లభించే ప్రొటెక్షన్ వంటి వాటిని ముందే చూసుకుంటే, అవసరం లేని ఎక్స్‌ట్రా వారెంటీలపై డబ్బు ఖర్చు చేయకుండా ఉండొచ్చు.
Also Read: యాపిల్‌కి చెక్ పెట్టిన శాంసంగ్ ఫోల్డబుల్.. అమ్మకాల్లో దూసుకుపోతున్న Galaxy Z Fold 8!