E-Paper
Advertisement

Priyanka Gandhi: అవమానాలకు ఎదురునిలిచి దృఢంగా నిలబడ్డావ్‌: ప్రియాంక గాంధీ ఎమోషనల్‌ పోస్ట్‌

Priyanka Gandhi: అవమానాలకు ఎదురునిలిచి దృఢంగా నిలబడ్డావ్‌: ప్రియాంక గాంధీ ఎమోషనల్‌ పోస్ట్‌
Advertisement

Priyanka Gandhi Emotional Post: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్ని అవమానాలు ఎదురైనా దృఢంగా నిలబడ్డావ్ అంటూ రాహుల్ గాంధీని పొగుడుతూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పట్టించుకోకుండా కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించావు అని రాహుల్‌ను కొనియాడారు.

లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కేవలం 292 సీట్లతోనే సరిపెట్టుకుంది. ఈ సారి ఎన్నికల్లో ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టిపోటీ ఇచ్చింది. ఊహించని విధంగా 234 సీట్లు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీని పొడుగుతూ పోస్ట్ పెట్టారు.

Advertisement

వారు నిన్ను ఎంతగానో అవమానించారు.. అవహేళన చేశారు..వారు ఏం చేసినా సరే నువ్వు ధృడంగా నిలబడ్డావ్, అవరోధాలు ఎదురైనా కూడా వెనక్కి దగ్గలేదు. నీపై అబద్దాలు ప్రచారం చేసినా నీ పోరాటాన్ని ఆపలేదు. ప్రతి రోజు నీపై కోపం చూపించినా నీ దరికి చేరనీయలేదు. వాళ్లందరికీ ఇప్పుడు అర్థం అవుతుంది. నువ్వు మాలో అందరి కంటే ధైర్య వంతుడివి అని మాకు తెలుసు. నీ సోదరిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను అంటూ ప్రియాంక ఎమోషన్ ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించింది. ముఖ్యంగా రాహుల్, ప్రియాంక గాంధీ స్టార్ క్యాంపెయిన్ నిర్వహించి బీజేపీ ఆశలకు గండి కొట్టారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రియాంక గాంధీ కూడా తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. భావోద్వేగ ప్రసంగాలతో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

Advertisement

Also Read: 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ రికార్డ్.. బీజేపీకి తగ్గిన ఓట్ షేర్

రాహుల్, ప్రియాంక ప్రచారానికి తోడు ఖర్గే వ్యూహాలు కూడా ఫలించాయి. దీంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో భారీగా పుంజుకుంది. కాంగ్రెస్ కంచు కోటగా భావించే అమేథీ, రాయ్ బరేలీలో సైతం భారీ మెజారిటీని సాధించింది. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీని ఓడించి రాహుల్ గాంధీ రివేంజ్ తీర్చుకున్నారు.

 

 

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×