E-Paper
Advertisement

దీపావళి సీజన్‌లో కొత్త కార్ల జాతర.. మారుతి, హ్యుందాయ్ నుంచి వస్తున్న కొత్త మోడళ్లు ఇవే!

దీపావళి సీజన్‌లో కొత్త కార్ల జాతర.. మారుతి, హ్యుందాయ్ నుంచి వస్తున్న కొత్త మోడళ్లు ఇవే!
Advertisement

New Cars From Maruti and Hyundai: భారత్‌ లో కార్ల మార్కెట్‌ లో మారుతి సుజుకి, హ్యుందాయ్‌ దూసుకెళ్తున్నాయి. ఈ రెండు సంస్థలు మరిన్ని కొత్త మోడళ్లను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అందులో మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫేస్‌ లిఫ్ట్, హ్యుందాయ్ బేయాన్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ రెండు కార్లు మాస్ మార్కెట్ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్-నవంబర్ పండుగ సీజన్‌లో వీటిని విడుదల చేసే అవకాశం ఉంది.

కొత్త ఇంజిన్‌తో వాగన్ ఆర్ ఫేస్‌ లిఫ్ట్

వాగన్ ఆర్ ఫేస్‌ లిఫ్ట్‌ ను మారుతి సుజుకి ఇప్పటికే చాలాసార్లు టెస్టింగ్ చేస్తూ కనిపించింది. బయట డిజైన్‌ లో భారీ మార్పులు కాకపోయినా, ఇంజిన్ విషయంలో ముఖ్యమైన అప్‌డేట్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న K-సిరీస్ ఇంజిన్‌కు బదులుగా కొత్త 1.2 లీటర్, 3-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను తీసుకొస్తారని తెలుస్తోంది. ఇది 81bhp పవర్, 112Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌ బాక్స్ ఆప్షన్లు ఉండనున్నాయి. తక్కువ RPM దగ్గర మంచి టార్క్‌ తో పాటు ఇంధన సామర్థ్యంపై కూడా కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

CNGలోనూ మార్పులు!

Advertisement

వాగన్ ఆర్ ఫేస్‌ లిఫ్ట్‌ లో CNG వెర్షన్ కూడా ఉండే అవకాశం ఉంది. బూట్ స్పేస్‌ను ఎక్కువగా ఉపయోగించుకునేలా CNG ట్యాంక్‌ను అండర్‌బాడీలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. డిజైన్ పరంగా కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడి జైన్ చేసిన బంపర్లు, కొత్త సీట్ అప్‌హోల్స్టరీ లాంటి మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లేకు సపోర్ట్ చేసే కొత్త టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా రావచ్చని తెలుస్తోంది.

హ్యుందాయ్ బేయాన్ ఎంట్రీ

అటు హ్యుందాయ్ భారత మార్కెట్ కోసం బేయాన్ ను అనౌన్స్ చేసింది. ఈ కొత్త క్రాసోవర్‌ను వెన్యూ, నెక్ట్స్ జెనరేషన్ క్రెటా మధ్య స్థానంలో ఉంచే అవకాశం ఉంది. సాధారణ హ్యాచ్‌ బ్యాక్ కంటే కొంచెం భిన్నమైన SUV తరహా డిజైన్ కోరుకునే కస్టమర్లను అనుకూలంగా ఉంటుంది. బేయాన్ డిజైన్‌ లో యారో ఆకారంలో LED DRLs, లో స్లంగ్ ఫ్రంట్ గ్రిల్, కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, బాడీ క్లాడింగ్  లాంటి అంశాలు కనిపించనున్నాయి.

CNGతో వచ్చే హ్యుందాయ్ క్రాసోవర్!

Advertisement

బేయాన్‌లో 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండవచ్చు. ముఖ్యంగా CNG టెక్నాలజీ ఈ కారులో స్పెషల్ అట్రాక్షన్ గా మారే అవకాశం ఉంది. అండర్‌ బాడీ CNG ట్యాంక్‌ తో దీనిని తీసుకురావచ్చని తెలుస్తోంది.ఇంటీరియర్‌లో టెక్నాలజీకి హ్యుందాయ్ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ డిస్‌ప్లే కోసం రెండు 10.25 అంగుళాల స్క్రీన్లు, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లాంటి ఫీచర్లు ఉండొచ్చు. భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు కూడా అందించే అవకాశం ఉంది.

Read Also: క్రాష్ టెస్ట్‌ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 7XO.. అన్ని వేరియంట్లకు 5 స్టార్ రేటింగ్!

Tags

Related News

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

హీరో నుంచి కొత్త బైక్.. క్యూరియాసిటీ పెంచుతున్న లేటెస్ట్ స్పై షాట్స్!

క్రాష్ టెస్ట్‌ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 7XO.. అన్ని వేరియంట్లకు 5 స్టార్ రేటింగ్!

స్పోర్టీ లుక్.. అదిరిపోయే స్పీడ్.. భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

బ్లాక్ కలర్‌కు గుడ్‌బై.. కొత్త లుక్‌తో 2027 కవాసకి వల్కన్ ఎస్ వచ్చేసింది!

చిన్న కారు.. పెద్ద రేంజ్.. భారత్‌ లోకి వస్తున్న కొత్త కాంపాక్ట్ ఈవీలివే!

2.7 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. భారత్‌ లోకి అడుగు పెట్టబోతున్న BYD పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కారు!

Big Stories

Advertisement
×