E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!
Advertisement

Best High-Range EV Scooters: పెట్రోల్ ధరలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, సిటీల్లో తక్కువ దూరాలు వెళ్లడం లాంటి అవసరాలకు చాలామంది ఈ స్కూటర్ల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ రేంజ్ ఇచ్చే మోడళ్లపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌ లో అందుబాటులో ఉన్న కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తున్నాయి. వాటిలో కొన్ని మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.కోమాకి SE అల్ట్రా

ఈ లిస్టులో ఎక్కువ క్లెయిమ్డ్ రేంజ్ ఉన్న మోడల్ కోమాకి SE అల్ట్రా. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 7.2kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 418 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని కంపెనీ వెల్లడించింది. దీని గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. సీటు కింద 50 లీటర్ల వరకు స్టోరేజ్ ఉంటుంది.

2.సింపుల్ అల్ట్రా

Advertisement

సింపుల్ అల్ట్రా కూడా ఎక్కువ రేంజ్ అందించే ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ.2.35 లక్షల నుంచి మొదలవుతుంది. 6.5kWh బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ 400 కిలోమీటర్ల వరకు క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తుంది. గంటకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పాటు 26 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

3.కోమాకి XR7

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రేంజ్ కోరుకునేవారికి కోమాకి XR7 మరో ఆప్షన్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.91,499 నుంచి ఉంటుంది. ఇందులో 72V 65Ah బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ 322 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. 30 లీటర్ల వరకు సీటు కింద స్టోరేజ్ ఉంటుంది.

4.ఓలా S1 ప్రో ప్లస్

Advertisement

ఓలా S1 ప్రో ప్లస్ థర్డ్ జనరేషన్ కూడా ఈ జాబితాలో ఉంది. దీని ధర రూ.1.74 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 5.3kWh బ్యాటరీతో వచ్చే ఈ మోడల్ 320 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 128 కిలోమీటర్లు. 34 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ ఉంటుంది.

5.సింపుల్ వన్

సింపుల్ వన్ ధర రూ.2.04 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 5kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 265 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. గంటకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పాటు 35 లీటర్ల సీటు కింద స్టోరేజ్, 172 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి.

Read Also: స్పోర్టీ లుక్.. అదిరిపోయే స్పీడ్.. భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Tags

Related News

దీపావళి సీజన్‌లో కొత్త కార్ల జాతర.. మారుతి, హ్యుందాయ్ నుంచి వస్తున్న కొత్త మోడళ్లు ఇవే!

హీరో నుంచి కొత్త బైక్.. క్యూరియాసిటీ పెంచుతున్న లేటెస్ట్ స్పై షాట్స్!

క్రాష్ టెస్ట్‌ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 7XO.. అన్ని వేరియంట్లకు 5 స్టార్ రేటింగ్!

స్పోర్టీ లుక్.. అదిరిపోయే స్పీడ్.. భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

బ్లాక్ కలర్‌కు గుడ్‌బై.. కొత్త లుక్‌తో 2027 కవాసకి వల్కన్ ఎస్ వచ్చేసింది!

చిన్న కారు.. పెద్ద రేంజ్.. భారత్‌ లోకి వస్తున్న కొత్త కాంపాక్ట్ ఈవీలివే!

2.7 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. భారత్‌ లోకి అడుగు పెట్టబోతున్న BYD పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కారు!

Big Stories

Advertisement
×