E-Paper
Advertisement

జియో సెన్సేషనల్ ఆఫర్.. ఫ్రీగా ‘కాన్వా ప్రో’ సేవలు.. డిజైనర్ అవ్వడం ఇక చాలా ఈజీ!

జియో సెన్సేషనల్ ఆఫర్.. ఫ్రీగా ‘కాన్వా ప్రో’ సేవలు.. డిజైనర్ అవ్వడం ఇక చాలా ఈజీ!
Advertisement

Jio Canva Offer: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో, ప్రపంచప్రసిద్ధ డిజైనింగ్ ప్లాట్‌ఫామ్ ‘కాన్వా’ (Canva) చేతులు కలిపాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా జియో తన వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. రూపాయి కూడా అదనపు ఖర్చు లేకుండా 12 నెలల పాటు ‘కాన్వా’ ప్రీమియం టూల్స్, ఏఐ ఫీచర్లను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలోని విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లు, చిన్న తరహా వ్యాపారవేత్తలకు గ్రాఫిక్ డిజైనింగ్‌ను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు జియో వర్గాలు పేర్కొన్నాయి.

ఆ ప్లాన్లపై కాన్వా ప్రో ఉచితం

జియో అందిస్తున్న నిర్దేశిత రీఛార్జ్ ప్లాన్లకు మాత్రమే కాన్వా ప్రో సేవలను ఉచితంగా అందించనున్నారు. జియో అధికారిక ప్రకటన ప్రకారం రూ. 399 ప్లాన్ రీఛార్జ్ చేసుకునే సబ్‌స్క్రైబర్లకు పూర్తిస్థాయి ‘కాన్వా ప్రో’ (Canva Pro) 12 నెలల పాటు ఉచితంగా లభించనుంది. అలాగే రోజుకు 2GB డేటా ఇచ్చే రూ. 349 కంటే ఎక్కువ విలువైన రీఛార్జ్ ప్లాన్లు వాడుతున్న వారికి 12 నెలల పాటు ‘కాన్వా ప్రో లైట్’ (Canva Pro Lite) సేవలు లభించనున్నాయి. ఈ ఆఫర్‌ను పొందడానికి యూజర్లు.. MyJio యాప్‌ను ఓపెన్ చేసి అందులోని ‘Canva benefit’ విభాగానికి వెళ్లి సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని జియో స్పష్టం చేసింది.

కాన్వాలో ఏమేం చేయవచ్చు?

Advertisement

కాన్వా ప్రో ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్ నుంచే ప్రొఫెషనల్ తరహా డిజైన్‌లను క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లు, రీల్స్, బ్యానర్లు, స్కూల్, కాలేజీ అసైన్‌మెంట్లు, ప్రెజెంటేషన్లు, వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్ మెటీరియల్స్, పండుగ శుభాకాంక్షల కార్డులు, ఇన్విటేషన్లు వంటివి సొంతంగా రూపొందించవచ్చు. ఇందుకోసం ఎటువంటి డిజైనింగ్ కోర్సులు, అనుభవం అక్కర్లేదు. కాన్వాలో ఉండే వేలాది రెడీమేడ్ టెంప్లేట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఎవరైనా సులభంగా కొత్త డిజైన్లను, ఎడిటింగ్ పనులను పూర్తి చేసుకోవచ్చు.

కాన్వా ప్రో vs ప్రో లైట్ మధ్య తేడా

కాన్వా ప్రో విషయానికి వస్తే ఇందులో బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్, మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ రీసైజ్, కంటెంట్ ప్లానర్ వంటి అన్ని అధునాతన AI ఫీచర్లు ఉంటాయి. అలాగే లక్షలాది ప్రీమియం ఫొటోలు, వీడియోలు, ఫాంట్లు అపరిమితంగా లభిస్తాయి. అదే విధంగా కాన్వా ప్రో లైట్ లో కూడా అనేక ప్రిమియం టూల్స్, ఎడిటింగ్ సదుపాయాలు ఉన్నప్పటికీ బ్రాండ్ కిట్ (Brand Kit) పరిమితంగా ఉంటుంది. అలాగే ఏఐ టూల్స్ వాడకంపై కొన్ని పరిమితులు ఉంటాయి.

Advertisement

Also Read: ఫ్రిజ్ లేకుండానే బ్రెడ్‌ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటుంది.. ఈ చిట్కాలు పాటిస్తే

భారత్‌పై దృష్టి పెట్టిన కాన్వా

అంతర్జాతీయంగా ఎంతో పాపులారిటీ సంపాదించిన కాన్వా సంస్థ.. భారత్ లోనూ విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను గుర్తించి తమ ప్లాట్‌ఫామ్‌లో హిందీతో పాటు అనేక భారతీయ భాషల సపోర్ట్ (Language Support) అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఆంగ్లం సరిగ్గా రాని వారు కూడా తమ సొంత భాషలోనే పోస్టర్లు, కంటెంట్‌ను సులభంగా రూపొందించుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి ఈ ఆఫర్ అర్హత కలిగిన జియో రీఛార్జ్ ఛానెళ్ల ద్వారా అందుబాటులోకి రానుంది. జియో అందించే ఈ 12 నెలల ఉచిత ఆఫర్.. కోట్లాది మంది భారతీయ డిజిటల్ క్రియేటర్లకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: సింగిల్ కమాండ్ తో టికెట్ బుక్ చేసిన ఏఐ.. ఇక IRCTCలో లాగిన్ అవసరం లేదా?

Tags

Related News

యూట్యూబ్ సంపాదన ఇక మరింత టఫ్..కొత్త నిబంధనల పూర్తి వివరాలు!

గూగుల్ మ్యాప్స్ అమేజింగ్ ఫీచర్..మీ పార్కింగ్ లొకేషన్ ఇక ఎప్పటికీ మర్చిపోరు!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!

మీ డేటా సేఫ్‌గా ఉండాలా? ChatGPTలో ఈ ఒక్కటి ఆఫ్ చేయండి చాలు!

రూ.54,999 ఫోన్ ఇప్పుడు ఇంత తక్కువకా? Vivo Y51 Pro 5Gపై క్రేజీ ఆఫర్!

iPhone 17 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 వరకు ఆదా చేసుకునే ఛాన్స్!

QR స్కాన్ అవసరం లేదు.. ట్యాప్ చేస్తే చాలు, UPIలో కొత్త పేమెంట్ ఫీచర్!

Big Stories

Advertisement
×