E-Paper
Advertisement

దేశంలో మరో ఉగ్ర కుట్ర భగ్నం.. 9 మంది అరెస్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం!

దేశంలో మరో ఉగ్ర కుట్ర భగ్నం.. 9 మంది అరెస్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం!
Advertisement

Terror Module: దేశంలో మరో ఉగ్ర కుట్ర భగ్నమైంది. రెండు మాడ్యూళ్లకు చెందిన 9 మందిని పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పిస్టళ్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసనల సమయంలో పెట్రోల్ బాంబులతో దాడులు జరపటంతోపాటు కాల్పులు జరపాలని పన్నాగాలు పన్నినట్టు వెల్లడైంది. పాకిస్తాన్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే నిందితులు ఈ దాడికి కుట్ర చేసినట్టుగా తేలింది.

వివరాల్లోకి వెళ్తే..

జంతర్ మంతర్ వద్ద హింసను ప్రేరేపించటానికి కుట్రలు పన్నిన ఉగ్రవాదులు అమృత్ సర్ లో ఉన్నట్టుగా నిఘా వర్గాల నుంచి పంజాబ్ పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు రాజస్థాన్ కు చెందిన సుఖ్ మన్ సింగ్ తోపాటు నలుగురు మైనర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు పిస్టళ్లు, తొమ్మిది బుల్లెట్లు, నాలుగు పెట్రోల్ బాంబులను సీజ్ చేశారు. విచారణలో వీళ్లందరూ పాకిస్తాన్ హ్యాండ్లర్లతో నిరంతర టచ్ లో ఉన్నట్టు వెల్లడైంది.

జంతర్ మంతర్‌లో దాడికి కుట్ర

Advertisement

మరోవైపు సుఖ్ మన్ పంజాబ్ లోని పోలీస్ భవనాలు, పోలీసుల కదలికలపై రెక్కీ చేసినట్టు తేలింది. విధ్వంసం చేయటానికి వీళ్లు జంతర్ మంతర్ వద్దకు వెళ్లినట్టుగా కూడా బయట పడింది. వీరికి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి ద్వారా ఆయుధాలు అందజేయాలని పథకం వేశారు. అయితే పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో కుట్రను అమలు చేయటం సాధ్యం కాలేదు.

మరో మాడ్యూల్..

ఇదిలా ఉంటే మరో మాడ్యూల్ కు చెందిన వారిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. వీళ్లు రైల్వే ట్రాక్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఫుటేజీని పాక్ లోని హ్యాండ్లర్లకు పంపుతున్నట్టు గుర్తించారు. ఈ కేసులో పంజాబ్ లోని మోహకంపురాకు చెందిన వంశీకుమార్ తోపాటు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఓ పిస్టల్, కెమెరాలు, చోరీ చేసిన బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Also Read: పొలిటికల్ రీ-ఎంట్రీపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్.. కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చేశారా?

మైనర్లకు డబ్బు ఆశ చూపి..

పట్టుబడిన ఈ రెండు మాడ్యూల్లలోని నిందితులను విచారించగా పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ఆ సమాచారం మేరకు పోలీసులు అన్మోల్ సింగ్ అనే వ్యక్తితోపాటు ఇప్పటికే జైల్లో ఉన్న సుఖ్ దేవ్ సింగ్, హర్మన్ సింగ్ లను ప్రొడక్షన్ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. వారు నిరుపేద కుటుంబాలకు చెంది, చదువు మధ్యలో వదిలేసిన మైనర్లకు డబ్బు ఆశ చూపించి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లోకి దించినట్టు అమృత్ సర్ పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ తెలిపారు.

Also Read: మోదీ వీడియో డిలీట్ వివాదం.. దెబ్బకు దిగొచ్చిన మెటా.. కేంద్రానికి జుకర్‌బర్గ్ సారీ!

Tags

Related News

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్‌జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

Big Stories

Advertisement
×