Water Projects: 12 ఏళ్లుగా ఏపీ ప్రభుత్వం ప్రతి బోర్డు సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తుందని, ఇది కొత్త విషయం కాదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రాజెక్ట్ లకు పరోక్షంగా మద్దతు ఇచ్చిన brs పార్టీ నేతలు అధికారం కోల్పోగానే కడుపు మంట తో బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి విరుచుకు పడ్డారు. తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో బీఆర్ఎస్ ఏ రోజు తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే రాయల సీమ ఎత్తిపోతల పథకం పనులు జరిగింది వాస్తవం కాదా అని ఫైర్ అయ్యారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయింది బిఆర్ఎస్ హయాంలో కాదా అని ప్రశ్నిచ్చారు. పట్టి సీమ ఎత్తిపోతల పథకం మీరు అధికారంలో ఉండగా పూర్తి కాలేదా అని ప్రశ్నించారు. తొమ్మిదినారేళ్ళు తెలంగాణ సొమ్ము ను లూటీ చేసి అధికారం కోల్పోగానే మొసలి కన్నీరు కారుస్తూ న్నారు అని ఉత్తం మండిపడ్డారు.
18 GRMB మీటింగ్లో అజెండాలో చేర్చ బడిన అంశాలు కొత్థవేమి కాదు. ఇవే అంశాలను మునపటి మీటింగులలో మరియు కరెస్పాండన్స్ లలో కూడా AP ప్రతి సారి ప్రస్తావిస్తూ వస్తున్నది. ఇవే అంశాలు సీతారామ ఎత్తిపోతల పథకం క్లియరెన్స్ విషయంలో కూడా AP ప్రస్తావించింది. దీని పైన ఈ ప్రభుత్వం ధీటుగా స్పందించి అవన్నియు కూడా నిరాధారమైనవని GRMB కి మరియు CWC కి దృష్టికి తీసుకువెళ్లి SSMP – SRLIP TAC క్లియరెన్స్ విజయవంతంగా అనుమతులు సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, AP రాష్ట్రం నిరంతరం GRMB, CWC మరియు జలశక్తి మంత్రిత్వ శాఖకు కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, గూడెం లిఫ్ట్ తదితర ఏడు ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వరాదని కోరుతూ వచ్చింది. MoJS ద్వారా TAC క్లియరెన్స్ పొందిన తరువాత కూడా సమీక్షించాలని AP ప్రతి మీటింగ్ నందు ప్రస్తావిస్తున్నదని మంత్రి ఉత్తం తెలిపారు.
Also Read: మోదీ వీడియో డిలీట్ వివాదం.. దెబ్బకు దిగొచ్చిన మెటా.. కేంద్రానికి జుకర్‌బర్గ్ సారీ!
AP లేవనెత్తిన అటువంటి అంశాలను ఈ ప్రభుత్వం ధీటుగా ప్రతిఘటించి మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడడంలో సఫలీకృతుమైనది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభత్వం ఎటువంటి ఉదాసీనత ప్రదర్శించుట లేదు. ఈ సందర్బంగా ప్రస్తావంచడం ఏమిటి అనగా గత BRS ప్రభుత్వమే ౩వ GRMB మీటింగ్ నందు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సంబంధించి, ఆయా రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరాలి లేదా ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి అని తన వైఖరి ద్వార స్పష్టం చేసింది. ఈ రెండు రాష్ట్రాలకు నీటి సరఫరా నియంత్రణను GRMB ప్రారంభించే ముందే ఈ షరతులలో ఏదో ఒకటి నెరవేరాలని ఆ ప్రభుత్వం పేర్కొంది. ఇదే విషయాన్నీ పునర్ఘటిస్తూ, గత BRS ప్రభుత్వం 2nd APEX కౌన్సిల్ మీటింగ్లో ట్రిబ్యునల్ ఏర్పాటు కొరకు AP రాష్ట్రం తో పోటీ పడి కోరడం జరిగిందని తెలిపారు.
ఈ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభ్యంతరాలను సమర్థవంతంగా ప్రతిఘటించి రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్ట మొదటి బహులార్దా సాధక సీతమ్మ సాగర్ – సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు TAC అనుమతులు 24.04.2025 సాధించింది. తొమ్మిదినారేళ్లలో చేయలేని పని చేసాం. 60 టీఎంసీ ల నీటి కేటాయింపులు సాధించాంమని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా ట్రిబ్యునల్ ఏర్పరిచే విషయంలో కూడా ఈ ప్రభుత్వం సమయస్ఫూర్తితో అడుగులు వేసి కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ట్రిబ్యునల్ ఇప్పటివరకు ఏర్పడకుండా అడ్డుకుందని అన్నారు.
2018-2022 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతానికి 200 టీఎంసీల వరద నీటిని తరలించే పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినప్పటికీ, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రేక్షకపాత్రకే పరిమితం కాలేదా? అని నిలదీశారు. ఆర్డీఎస్ లో వాటా మేరకు నీళ్ల కోసం ఏ రోజు బీఆర్ ఎస్ ప్రయత్నం చేయలేదు. ఆర్డీఎస్ ఆధునీకరణ విషయం లో ఏపీ, కర్ణాటక సీఎం లను ఒప్పించాం. మీరు ఏ రోజైనా కర్ణాటక సీఎంను కలిసి ఒప్పించారా అని నిలదీశారు. kwdt లో కృష్ణా జలాల వాటా కోసం స్వయంగా విచారణ కు హాజరై న్యాయ నిపుణులతో సూచన చేశామన్నారు. గత ప్రభుత్వం కంటే సమర్థ వంతంగా వాదనలు వినిపిస్తున్నాం అని మంత్రి ఉత్తం స్పష్టం చేశారు.
Also Read: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మరో రెండు భారీ ఫ్లైఓర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!