E-Paper
Advertisement

మంచులో ఒంటరి సైనికుడి సర్వైవల్ ఫైట్.. యుద్ధం కంటే ప్రాణాల కోసం జరిగే ఈ పోరాటమే భయంకరం

మంచులో ఒంటరి సైనికుడి సర్వైవల్ ఫైట్.. యుద్ధం కంటే ప్రాణాల కోసం జరిగే ఈ పోరాటమే భయంకరం
Advertisement

War Survival Drama: వార్ డ్రామాలు అంటే చాలా మందికి భారీ బాంబు దాడులు, ట్యాంకులు, వందల మంది సైనికుల మధ్య జరిగే పోరాటాలే గుర్తుకు వస్తాయి. కానీ కొన్నిసార్లు ఒకే ఒక్క సైనికుడి ప్రాణాల కోసం చేసే పోరాటమే యుద్ధం కంటే ఉత్కంఠగా అనిపిస్తుంది. అలాంటి భావోద్వేగాలతో పాటు సర్వైవల్ ఎలిమెంట్స్‌ను మిళితం చేసిన హాలీవుడ్ వార్ యాక్షన్ డ్రామానే ‘లక్కీ స్ట్రైక్’ (Lucky Strike 2026). రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మంచు అడవుల్లో ఒంటరిగా చిక్కుకున్న సైనికుడి కథ ఎలా సాగింది ? సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

1944 డిసెంబర్. రెండో ప్రపంచ యుద్ధం కీలక దశలో ఉన్న సమయం అది. ‘బాటిల్ ఆఫ్ ది బల్జ్’ సందర్భంగా అమెరికన్ సైన్యానికి చెందిన కెప్టెన్ జాన్ కాజిల్ తన బృందంతో కలిసి నాజీ సైన్యాన్ని ఎదుర్కొనే మిషన్‌లో పాల్గొంటాడు. మిషన్ సాఫీగా సాగుతున్నట్టే కనిపించినా, అనుకోకుండా నాజీ సైన్యం మెరుపుదాడి చేస్తుంది. ఆ దాడిలో జాన్ కాజిల్ మినహా అతని బృందంలోని సైనికులంతా ప్రాణాలు కోల్పోతారు. తీవ్రంగా గాయపడిన జాన్, శత్రువుల ఆధీనంలోని మంచు అడవిలో ఒంటరిగా చిక్కుకుపోతాడు.

Advertisement

చుట్టూ శత్రువులే, గడ్డకట్టే చలి. ఆహారం, సహాయం లేదు. అలాంటి పరిస్థితిలో అతని వద్ద మిగిలింది ఒక ఆధునిక మిలిటరీ ఫీల్డ్ రేడియో, మరోవైపు ‘లక్కీ స్ట్రైక్’ సిగరెట్ల ప్యాకెట్ మాత్రమే. ఆ రేడియో ద్వారా తన పైఅధికారులతో సంప్రదించేందుకు జాన్ చేసే ప్రయత్నాలు కథకు ప్రధాన బలంగా నిలుస్తాయి. ప్రతి క్షణం నాజీ సైనికులు అతని కోసం గాలిస్తుండగా, మరోవైపు బేస్ క్యాంప్‌కు తన ఆచూకీ చేరవేయాల్సిన బాధ్యత కూడా అతనిపైనే ఉంటుంది.

ప్రమాదకరమైన అడవులు దాటుతూ, శత్రువుల కళ్లను తప్పించుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో ఒక స్థానిక కుటుంబం అతనికి ఆశ్రయం ఇస్తుంది. కానీ ఆ నిర్ణయం వారినీ ప్రమాదంలోకి నెడుతుంది. చివరకు జాన్ తన తెలివితేటలతో నాజీలను మోసం చేసి సురక్షితంగా బయటపడగలిగాడా ? లేక యుద్ధం అతని ప్రయాణానికి ముగింపు పలికిందా ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

‘లక్కీ స్ట్రైక్’లో భారీ యుద్ధ సన్నివేశాల కంటే ఒక సైనికుడి మానసిక ధైర్యం, ఒంటరి పోరాటాన్ని మనసుకు హత్తుకునే విధంగా చూపించారు. స్కాట్ ఈస్ట్‌వుడ్ ఇందులో ప్రధాన పాత్రను పోషించగా, దర్శకుడు రాడ్ లూరీ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఆగస్టు 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. కేవలం ఇంగ్లీష్ ఆడియోలో మాత్రమే వీక్షించవచ్చు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో సినిమాను చూడొచ్చు. యుద్ధం నేపథ్యంలో సాగే సర్వైవల్ కథలు, భావోద్వేగాలతో కూడిన మిలిటరీ డ్రామాలు నచ్చితే ‘లక్కీ స్ట్రైక్’ మూవీ మీ కోసమే. ఒక సైనికుడి ధైర్యం, ప్రాణాల కోసం చేసిన పోరాటం, ఉత్కంఠభరితమైన కథనం ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి. హాలీవుడ్ వార్ డ్రామాలను ఇష్టపడే వారు అస్సలు మిస్ అవ్వొద్దు.

Read Also: సమంత, తాప్సీ సూపర్ హిట్ సినిమాలకు డిలీట్ డేట్ ఫిక్స్… ఓటీటీలో చూసేందుకు ఇదే చివరి ఛాన్స్

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×