E-Paper
Advertisement

Kanha Group IT Raids: స్వీట్స్ వ్యాపారి ఇంట్లో సీక్రెట్ వాల్.. బద్దలు కొడితే కోట్ల విలువైన బంగారం

Kanha Group IT Raids: స్వీట్స్ వ్యాపారి ఇంట్లో సీక్రెట్ వాల్.. బద్దలు కొడితే కోట్ల విలువైన బంగారం
Advertisement

Kanha Group IT Raids: ఇటీవల వచ్చిన ఓ సినిమాలో.. ఇంటి గోడలో, పై కప్పు, బాత్రూమ్ లో భారీగా డబ్బు, బంగారం దాచేస్తాడు విలన్. ఐటీ అధికారి అయిన హీరో వాటిని పట్టుకుంటాడు. ఇదే సీన్ రాజస్థాన్ లోని జైపూర్ లో రిపీట్ అయింది. ఓ వ్యాపారి కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఓ స్ట్రాంగ్‌రూమ్‌ను దాచిపెట్టి, దానికి ఓ సీక్రెట్ గోడను కట్టించాడు. ఎవరో ఓ వ్యక్తి ఈ సమాచారాన్ని ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు లీక్ చేశాడు.

రాజస్థాన్‌లోని కన్హా గ్రూప్‌పై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. ఈ సంస్థకు చెందిన 33 ప్రాంతాల్లో ఒకేసారి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీగా పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులో.. వ్యాపారి ఇల్లు, సంస్థల నుంచి పెద్ద ఎత్తున డబ్బు, బంగారం, విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

కన్హా గ్రూప్‌పై దాడులు

Advertisement

కన్హా గ్రూప్‌ కు చెందిన సంస్థలపై ఐటీ అధికారులు ఆరు నగరాల్లోని 33 ప్రదేశాలలో ఒకేసారి దాడులు ప్రారంభించారు. జైపూర్‌లోని 26 ప్రదేశాలలో సోదాలు చేశారు. ఉదయపూర్‌లోని రెండు ప్రాంతాలు, శ్రీగంగానగర్, కోట, కరౌలి, హిందౌన్, ముంబైలలో ఒక్కొక్క చోట ఐటీ బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి.
2008లో నట్వర్ లాల్ శారదా స్థాపించిన కన్హా గ్రూప్.. జైపూర్‌కు చెందిన ప్రముఖ ఫుడ్, డ్రింక్స్ సంస్థ. ఇది స్వీట్లు, నమ్కీన్లు, బేకరీ ఉత్పత్తులకు ప్రసిద్ధి.

రూ. 50 లక్షల నగదు

ఐటీ అధికారుల సోదాల్లో రూ. 100 కోట్లకు పైగా పన్ను ఎగవేత డబ్బును లగ్జరీ హోటళ్లలో పెట్టుబడి పెట్టినట్లు బయటపడింది. జైపూర్‌లోని రెండు విలాసవంతమైన ఫైవ్-స్టార్ హోటల్లు, హోటల్ తాజ్ కుందన్ వాన్‌ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కన్హా సంస్థల అధినేత ఇల్లు, కార్యాలయంలో పెద్ద సంఖ్యలో అనుమానాస్పద పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థల యజమాని ఇంట్లో ఓ రహస్య గదిలో.. సీక్రెట్ వాల్ ను అధికారులు గుర్తించారు. దీని బద్దలు కొట్టగా భారీగా బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఈ బంగారు ఆభరణాల విలువ భారీగా ఉంటుందని అధికారులు అంటున్నారు.

Advertisement

Also Read: హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు.. హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు

కన్హా గ్రూప్‌కు చెందిన 10కి పైగా బ్యాంక్ లాకర్లను ఐటీ శాఖ కనుగొంది. ఈ లాకర్లలో కోట్లాది రూపాయల విలువైన వివాదాస్పద ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, భారీగా బంగారం ఉండవచ్చునని భావిస్తున్నారు.

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×