E-Paper
Advertisement

పాక్ ఉగ్రవాదులకు కేంద్రం బిగ్ షాక్.. షహబాజ్ నెట్‌వర్క్‌ ఉగ్ర సంస్థగా ప్రకటన!

పాక్ ఉగ్రవాదులకు కేంద్రం బిగ్ షాక్.. షహబాజ్ నెట్‌వర్క్‌ ఉగ్ర సంస్థగా ప్రకటన!
Advertisement

Shahzad Bhatti: పాకిస్తాన్ లో ఉంటూ మన దేశంలో ఉంటూ మన దేశంలో ధ్వంస రచనలు చేస్తున్న గ్యాంగ్ స్టర్ షహబాజ్ భట్టీ నెట్ వర్క్ ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఉపా (యూఏపీఏ) చట్టం ప్రకారం ఈ నెట్ వర్క్ ను ఉగ్రవాద సంస్థల జాబితాలోకి కేంద్ర హోం శాఖ చేర్చింది. చట్టంలోని సెక్షన్ 35(1)(a) కింద ఈ చర్య తీసుకుంది. చట్టంలోని మొదటి షెడ్యూల్‌ లో 46వ సంస్థగా షహజాద్ భట్టి నెట్‌వర్క్ చేర్చింది. ఈ నెట్ వర్క్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు కేంద్రం ఆరోపించింది.

డిజిటల్ కమ్యూనికేషన్..

యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లిస్తొందని పేర్కొంది. ఇతర నిషేధిత సంస్థలతో కూడా ఈ నెట్ వర్క్ కు సంబంధాలున్నాయని వెల్లడించింది. హింసాత్మక కార్యకలాపాలతో ప్రజాశాంతికి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించింది. సోషల్ మీడియా డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌ ల ద్వారా రెచ్చగొట్టే సందేశాలు వ్యాప్తి చేస్తోందని కూడా పేర్కొంది. షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయని హోంశాఖ తెలిపింది. ఉపాతో పాటు ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం ప్రకారం దీనిపై కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వలసల చట్టం కింద కూడా కేసులు నమోదైనట్టు తెలిపింది.

Advertisement

Also read: అలియాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. రూ.1.38 కోట్లు మంజూరు!

భారీ ఆపరేషన్‌..

గత నెలలోనే 14 రాష్ట్రాల్లో భద్రతా సంస్థలు ఈ నెట్ వర్క్ పై భారీ ఆపరేషన్‌ నిర్వహించాయి. సంస్థకు చెందిన 253 మందిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ క్రమంలో షహబాజ్ భట్టీ నెట్ వర్క్ పై 80కి పైగా ఎఫ్ఐఆర్‌ లు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. నిందితుల నుంచి ఐఈడీలు, పిస్టళ్లు, లైవ్ బుల్లెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. ఇటీవల బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఎస్‌బీఎన్‌ నుంచి ముప్పు ఉండవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు కూడా చేశాయి. హైదరాబాద్ బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ రెజిమెంట్ లో జరిగిన ఆయుధాల చోరీ కేసుతో ఈ నెట్ వర్క్ కు సంబంధం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

Advertisement

Also read: ఖైరతాబాద్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఆ దానమే.. మూలమా?

Tags

Related News

కాంగ్రెస్ నేతల దారుణ హత్య కేసు.. ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు.. 10 మందికి మరణశిక్ష

లాడ్జి బాత్రూంలో యువతి మృతదేహం.. ఇద్దరు యువకులు పరార్, బెంగుళూరు సమీపంలో ఘటన

ఇదేందయ్యా ఇది.. 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. వీడియో వైరల్

రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన కారు.. గాల్లోకి ఎరిగిన వ్యక్తి, హిట్ అండ్ రన్‌లో షాకింగ్ దృశ్యాలు

రైల్వే జాబ్స్.. 7వ పే కమిషన్ జీతంతో 560 ఉద్యోగాలు

45 ఏళ్ల క్రితం నాటి దొంగను పట్టించిన ఏఐ ఫోటో.. ఎలానో తెలిస్తే మీరు షాకవ్వడం కాయం!

ప్రధాని మోదీ జన్మదిన వేళ ఎంపీ డీకే అరుణ సంచలన పిలుపు!

Big Stories

Advertisement
×