Gabbar Singh Ramesh:హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు రమేష్. ఈ సినిమాతోనే గబ్బర్ సింగ్ రమేష్ (Gabbarsingh Ramesh)గా మారిపోయిన ఈయన. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. బ్రెయిన్ స్ట్రోక్ కి గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోనే ఒక హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. రంగంలోకి డైరెక్టర్ హరిష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ), నాగబాబు (Nagababu) వంటి తారలు ఆర్థిక సహాయం కూడా అందించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే వార్తలు రాగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గబ్బర్ సింగ్ రమేష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకొని ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని ఒక సన్నివేశాన్ని చూస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికైతే గబ్బర్ సింగ్ రమేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే గబ్బర్ సింగ్ రమేష్ హాస్పిటల్లో చేరారు అన్న విషయం మెగా కుటుంబం దృష్టికి చేరడంతో వెంటనే మెగా సోదరులు స్పందించారు. చిరంజీవి రూ.3లక్షలు ఆర్థిక సహాయం అందించగా.. నాగబాబు రూ.2లక్షలు.. అలా మొత్తం రూ.5లక్షలు అందించారు. అంతేకాదు చిరంజీవి వైద్యులతో మాట్లాడుతూనే.. ప్రభుత్వ ఆరోగ్య పథకాలకి కూడా సహాయం అందించారు. ముఖ్యంగా రమేష్ కుటుంబానికి పూర్తి మద్దతు పలుకుతూనే.. వైద్య పర్యవేక్షణ అందిస్తామని పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారు. మొత్తానికైతే మెగా కుటుంబం అందించిన మెగా సాయంతో ఇప్పుడు గబ్బర్ సింగ్ రమేష్ కోలుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:40ల్లోనూ తగ్గని అందం.. అనసూయ గ్లామర్ లుక్స్ వైరల్!
హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం గబ్బర్ సింగ్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ఈ సినిమాలో వచ్చే అంత్యాక్షరి కామెడీ ఎపిసోడ్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో మరోసారి పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈయన.. ఆ తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో కూడా కాసేపు కనిపించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కామెడీ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రమేష సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండేవారు.