E-Paper
Advertisement

కారు బానెట్‌పై గాళ్‌ఫ్రెండ్‌ని ఈడ్చుకెళ్లిన ప్రియుడు.. లక్నోలో షాకింగ్ ఘటన, వీడియో వైరల్

కారు బానెట్‌పై గాళ్‌ఫ్రెండ్‌ని ఈడ్చుకెళ్లిన ప్రియుడు.. లక్నోలో షాకింగ్ ఘటన, వీడియో వైరల్
Advertisement

woman climbed car bonnet: ఓ వ్యక్తి తన స్నేహితురాలితో పార్క్‌కి వెళ్లాడు. ఈ విషయం యువకుడి ప్రియురాలికి తెలియడంతో క్షణాల్లో అక్కడ వాలిపోయింది. సదరు ప్రియుడ్ని నిలదీయడంతో కోపానికి గురయ్యాడు. ప్రియుడు కారు నుంచి వెళ్లిపోతుండగా ప్రియురాలి అతను కారు బానెట్‌పై ఎక్కేందుకు ప్రయత్నం చేసింది. కొన్ని మీటర్ల దూరం కారుతో ప్రియురాల్ని ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

లక్నోలో షాకింగ్ ఘటన

లక్నోలోని గోమతి నగర్‌లో ఉన్నాడు జానేశ్వర్ మిశ్రా. ఫైనాల్సియల్‌గా బెటర్ పొజిషన్. సమీపంలోని ఓ పార్కుకు తన స్నేహితురాలితో కలిసి వచ్చాడు జానేశ్వర్. ఈ విషయం తెలియడంతో అతడి ప్రియురాలికి తెలియడంతో ఇంటి నుంచి బయలుదేరింది. నేరుగా ప్రియుడు ఉన్న పార్క్ కి వచ్చేసింది. పట్టరాని కోపంతో తన ప్రియుడ్ని నిలదీసింది. దీంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టపగలు వ్యవహారం కావడంతో వాటిని అందరు చూస్తున్నారు.

కారు బానెట్‌పై గాళ్‌ఫ్రెండ్‌ని ఈడ్చుకెళ్లిన ప్రియుడు

Advertisement

వాగ్వాదం నుంచి తప్పించుకునేందుకు యువకుడు తన కారుని వేగంగా పోనిచ్చే ప్రయత్నం చేశాడు. ప్రియుడ్ని ఆపే క్రమంలో యువతి కారుకు అడ్డంగా నిలబడింది. అయినప్పటికీ అతడు కారును ఆపకుండా ముందుకు పోనివ్వడంతో కారు బానెట్‌పై ఎక్కేందుకు ప్రయత్నం చేసింది. నేను చావను.. నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని గట్టిగా అరుస్తూ యువతి కారు బానెట్‌ను చేతులతో కొడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

ALSO READ: పాక్ ఉగ్రవాదులకు కేంద్రం బిగ్ షాక్.. షహబాజ్ నెట్‌వర్క్‌ ఉగ్ర సంస్థగా ప్రకటన!

Advertisement

తొలుత కారుని నడిపిన ఆ యువకుడు, ఆ తర్వాత వేగం పెంచాడు. చివరకు యువతి బానెట్ పైనుంచి కిందపడిపోవడంతో వెంటనే కారుతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో గాయపడిన యువతిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా యువకుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

 

 

Related News

పాక్ ఉగ్రవాదులకు కేంద్రం బిగ్ షాక్.. షహబాజ్ నెట్‌వర్క్‌ ఉగ్ర సంస్థగా ప్రకటన!

కాంగ్రెస్ నేతల దారుణ హత్య కేసు.. ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు.. 10 మందికి మరణశిక్ష

లాడ్జి బాత్రూంలో యువతి మృతదేహం.. ఇద్దరు యువకులు పరార్, బెంగుళూరు సమీపంలో ఘటన

ఇదేందయ్యా ఇది.. 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. వీడియో వైరల్

రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన కారు.. గాల్లోకి ఎరిగిన వ్యక్తి, హిట్ అండ్ రన్‌లో షాకింగ్ దృశ్యాలు

రైల్వే జాబ్స్.. 7వ పే కమిషన్ జీతంతో 560 ఉద్యోగాలు

45 ఏళ్ల క్రితం నాటి దొంగను పట్టించిన ఏఐ ఫోటో.. ఎలానో తెలిస్తే మీరు షాకవ్వడం కాయం!

Big Stories

Advertisement
×