Delhi Factory Fire: ఢిల్లీలోని స్వరూప్ నగర్ పరిధిలో ఉన్న గలీ నెం. 2లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖస్రా నెం. 357/58 వద్ద ఉన్న భవనంలో జూడో దుస్తులు, బాక్సింగ్ గ్లోవ్స్ తయారుచేసే ఒక ఫ్యాక్టరీ నడుస్తోంది. అకస్మాత్తుగా ఈ ఫ్యాక్టరీలోని గ్రౌండ్, మొదటి అంతస్తులలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం.
భయాందోళనతో దూకేసిన నివాసితులు
అయితే, ఎదురుగా ఉన్న భవనంలో నివసించే ప్రజలు దట్టమైన పొగ, భయానక మంటలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో కొందరు భవనం పైనుంచి కిందకు దూకేశారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరూ ప్రమాదం నుండి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది
Also Read: నకిలీ పన్నీర్ దందాకు సర్కార్ చెక్.. ఏడాది పాటు అనలాగ్ పన్నీర్‌పై నిషేధం!