E-Paper
Advertisement

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!
Advertisement

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు కార్యక్రమంలో భాగంగా సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీలు అనే విధంగా షో జరుగుతున్న సంగతి తెలిసిందే. హౌస్ లో సెలబ్రిటీలు సామాన్యులను చులకన భావనతో చూస్తున్నారంటూ ఇప్పటికే ఈ షో పట్ల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు హౌస్ లో ఉన్నటువంటి సెలబ్రిటీలకు సపోర్ట్ చేయడంతో ఇది కాస్త సంచలనగా మారింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న కామనర్స్ కోసం మాజీ కంటెస్టెంట్ డెమోన్ పవన్(Demon Pawan) మద్దతుగా నిలిచారు.

త్రిగుణ్ కు ఎల్లో కార్ట్ ఇవ్వాలి..

తాజాగా పవన్ జియోహాట్‌స్టార్‌లో ఇటీవల జరిగిన బిగ్ బాస్ 24/7 లైవ్ చాట్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లో మొదటివారం జరిగిన కొన్ని సంఘటనల గురించి డెమోన్ పవన్ మాట్లాడారు. ముఖ్యంగా త్రిగుణ్ రోహిత్ మధ్య జరిగిన వివాదం గురించి పవన్ మాట్లాడుతూ పవన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తన పూర్తి మద్దతు రోహిత్ నాయుడు(Rohit Naidu)కి ఉందని పవన్ తెలిపారు. త్రిగుణ్ కేవలం రోహిత్ నాయుడుని టార్గెట్ చేస్తూ తనని వేధిస్తున్నాడని పవన్ తెలిపారు. ఇక త్రిగుణ్ మాట్లాడిన చిల్లార బ్యాచ్, స్టెరాయిడ్ బాడీ మాటలను కూడా పవన్ ఖండించడమే కాకుండా ఈ వారంలో నాగార్జున(Nagarjuna) గారు త్రిగుణ్ కు ఎల్లో కార్డు ఇవ్వాలని సూచించారు.

మూలాలను మర్చిపోకూడదు..

Advertisement

త్రిగుణ్ అగ్నిపరీక్ష(Agnipariksha) కార్యక్రమం గురించి కూడా చులకనగా చేసి మాట్లాడటాన్ని పవన్ తప్పుపట్టారు. హౌస్ లో సెలబ్రిటీలు సామాన్యులను తక్కువ చూపు చేసి మాట్లాడుతున్నారని అయితే హౌస్ లో సెలబ్రిటీ ట్యాగ్ వేయించుకున్న వారందరూ కూడా ఒకప్పుడు సామాన్యులేనని ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, ఎవరు కూడా వారి మూలాలను మర్చిపోకూడదంటూ పవన్ హెచ్చరించారు. ఇక రోహిత్ నాయుడు గురించి కూడా పవన్ మాట్లాడుతూ ..

టాప్ 3 కంటెంట్ గా డెమోన్…

రోహిత్ నాయుడు చాలా అద్భుతంగా ఆట ఆడుతున్నారు అయితే కొన్నిసార్లు టాస్కుల విషయంలో, వివాదం చోటు చేసుకున్న సమయంలో నోరు జారుతున్నారని ఆ విషయంలో రోహిత్ నాయుడు మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుందని పవన్ తెలిపారు. గత సీజన్లో కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా హౌస్ లోకి అడుగుపెట్టిన పవన్ ఇప్పుడు హౌస్ లో కొనసాగుతున్న సామాన్యులకు మద్దతుగా నిలుస్తూ త్రిగుణ్ పట్ల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక గత సీజన్లో అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ టాప్ 3 కంటెస్టెంట్ గా డబ్బు తీసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం కెరియర్ పరంగా సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Also Read: నటరాజ్ మాస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ చేయకపోవడానికి అదే కారణమా.. క్రెడిట్ అంతా వాళ్ళదేనా?

Related News

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Karthika Deepam 2 Serial Today Episode September 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణకు మాలిని షాక్ – హాస్పిటల్ లో దీప          

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ రివర్స్.. తాయారును రెచ్చగొట్టిన నారాయణ..పంతులు ప్లాన్ సక్సెస్..

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు పల్లవి ప్లాన్.. అయ్యో పార్వతి.. సీన్ రివర్స్..

Big Stories

Advertisement
×