E-Paper
Advertisement

రైతు భార్య అకౌంట్లో లక్ష్మీదేవి.. ఏకంగా రూ. 10 కోట్లు జమ, ఆమె సమాధానాలకు అందరూ షాక్

రైతు భార్య అకౌంట్లో లక్ష్మీదేవి.. ఏకంగా రూ. 10 కోట్లు జమ, ఆమె సమాధానాలకు అందరూ షాక్
Advertisement

UP Woman: మనకు తెలీకుండా మన బ్యాంక్ అకౌంట్లోకి భారీ ఎత్తున నిధులు జమ అయితే ఒక్కసారిగా షాకవుతాము. ఎలా వచ్చాయి.. ఎవరు వేశారు అనేదానిపై ఆరా తీస్తాం. చాలామంది కొంత డబ్బు వాడుకున్నవారు లేకపోలేదు. యూపీలోని ఓ మహిళకు అలాంటి పరిస్థితి ఎదురైంది. ఏకంగా 10 కోట్ల రూపాయలు ఆమె ఖాతాలో పడ్డాయి. ఆమె సమాధానం చూసి బ్యాంకు అధికారులు అవాక్కయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లో రైతు భార్య ఖాతాలో లక్ష్మీదేవి.. కోట్లకు పగడలెత్తింది

Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా దేవ్‌గంజ్ గ్రామానికి చెందిన రైతు భార్య రీటా. ఆమె ఫ్యామిలీ పూర్తిగా వ్యవసాయ కుటుంబం. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేస్తోంది ఆమె. నవరాత్రుల సమయంలో అష్టమి రోజున డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎంకి వెళ్లింది. ఏటీఎం కార్డు పెట్టి బ్యాలెన్స్ చెక్ చేసుకుంది. అందులోని 10 కోట్ల రూపాయలు ఉండడం చూసి ఒక్కసారిగా షాకైంది.

మళ్లీ అనుమానం వచ్చి మరొక ఏటీఎంకి వెళ్లి చెక్ చేసింది. ఈసారి కూడా దాదాపు రూ.9,99,49,588 ఉన్నట్లు చూసి ఆశ్చర్యపోయింది. అది స్క్రీన్‌ షాట్ తీసింది. ఆ తర్వాత ఈ విషయాన్ని రీటా.. తన ఫ్యామిలీ సభ్యులకు తెలిపింది. రీటా ఆ డబ్బు ఉపసంహరించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఆ నిధులను ముట్టుకోవద్దని ఆమె తన కుటుంబ సభ్యులకు గట్టిగా చెప్పింది.

Advertisement

కుటుంబసభ్యులకు సమాచారం.. ఆమె సమాధానాలకు బ్యాంకు అధికారులు షాక్

ఈ డబ్బు మనది కాదు.. ఒక్క రూపాయి తాకొద్దని కుటుంబసభ్యులకు తేల్చి చెప్పింది. రీటా తన కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకుకు వెళ్లింది. సెలవు కారణంగా బ్యాంక్ మూసి ఉంది. చివరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా కరీంగంజ్ బ్రాంచ్ మేనేజర్‌తో కలిశారు రీటా కుటుంబ సభ్యులు. సాంకేతిక లోపం కారణంగా లావాదేవీలో తప్పు జరిగి ఉంటుందని రీటాకు చెప్పారు.

బ్రాంచ్ తిరిగి తెరిచిన తర్వాత ఈ విషయంపై విచారణ జరిపి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మేనేజర్. ఈ విషయం ఆ ప్రాంతమంతటా చర్చనీయాంశంగా మారింది. ఆమె కుటుంబానికి నిధులను దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉన్నా, రీటా నిజాయితీని మెచ్చుకున్నారు. ఆమె తీసిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ALSO READ: వార్ ఎఫెక్ట్.. ప్రపంచ దేశాలు ఎలా ఉన్నా, భారత్‌పై ఎఫెక్ట్ పడనీయం: మోదీ

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×