E-Paper
Advertisement

Sabarimala Gold Theft Case: శబరిమల బంగారం చోరి కేసులో బిగ్‌ట్విస్ట్.. ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్!

Sabarimala Gold Theft Case: శబరిమల బంగారం చోరి కేసులో బిగ్‌ట్విస్ట్.. ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్!
Advertisement

Sabarimala Gold Theft Case: శబరిమల అంటే కేరళ వాసులకు ఎలాంటి నమ్మకాలున్నాయో తెలీదు. కానీ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ నమ్మకాల ఉధృతి చాలా చాలా ఎక్కువ. ఇక్కడ అయ్యప్ప అంటే, అంతదూరంలో ఉన్న స్వామి వారి సందర్శనకు పాదయాత్రగా నడిచి వెళ్లే భక్తులుంటారు. అంతగా స్వామివారి పట్ల తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు.

కొన్ని రోజుల పాటు- వందలాది మంది- వేల కిలోమీటర్ల మేర నడచి స్వామివారి దర్శనం చేస్తే ఆ పుణ్యమే వేరని భావిస్తారు. తెలుగువారి ఆరాధ్య దైవంగా భాసిల్లుతున్నారు శబరిగిరీశుడు. భక్తజనుల కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు. ఆ నియమ నిష్టలు చూస్తే ఎవరికైనా సరే, ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది.

Advertisement

నలభై ఒక్క రోజుల పాటు, అత్యంత నిష్టాగరిష్టంగా మాలధారణ చేస్తారు తెలుగు భక్తులు. వేకువ జామున చన్నీటి స్నానాలతో, ఏక భుక్తాలతో.. తెలుగు వారు పాటించే కఠిన నియమాలు బహుశా దక్షిణాదిలో మరెవరూ పాటించరేమో. అలా మనమిక్కడ అయ్యప్ప స్వామివారికి ఇన్నేసి నియమ నిష్టలతో కొలుస్తుంటే.. అక్కడ స్వామివారంటే వారికి కనీస భయభక్తులు లేవా? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది. ఈ ఏడాది మొత్తం శబరిగిరీశుడి హుండీ ఆదాయం 330 కోట్లకు పైగా వచ్చింది. ఇందులో తెలుగువారి వాటా సగానికి పైగా ఉంటుందని అంచనా. ఆ విరాళాలు సరైన మార్గంలోనే వెళ్తున్నాయా? అన్న అనుమానానికి ఆస్కారమేర్పడుతోంది.

అందుకు కారణం శబరిమల ప్రధాన పూజారి కందారరు రాజీవరును అరెస్టు ఉదంతమే. శుక్రవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో.. ఈ అరెస్టు జరిగింది. అది కూడా పూర్తి విచారణ తర్వాతే ఈ అరెస్టు చేసినట్టు చెబుతున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ తో రాజీవరుకు సన్నిహిత సంబంధాలున్నట్టు గుర్తించారు సిట్ అధికారులు. బంగారు తాపడం చోరీ వ్యవహారంలో రాజీవరు పాత్ర కూడా ఉన్నట్టు విచారణలో తేలినట్టు తెలుస్తోంది.

Advertisement

ఉన్ని కృష్ణన్ ని శబరిమలకు తీసుకువచ్చింది కూడా తంత్రి రాజీవరుగానే గుర్తించారు. ఇదంతా కూడా ఇతర నిందితుల వాంగ్మూలం ద్వారా తేల్చారు. బంగారు తాపడాల చోరీ గురించి ఆయనకు ముందే తెలుసని అంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఈడీ సైతం కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

ఇంతకీ ఏంటీ కేసు? అని చూస్తే.. శబరిమల గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారుపూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వీటిని సరి చేయించి సరికొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్ని కృష్ణన్ అనే దాత తీస్కెళ్లారు. ఈ పని చెన్నైలోని ఒక సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే టైంలో తాపడాల బరువు 42.100 కిలోలుగా రికార్డుల్లో రాసి ఉన్నారు.

Also Read: కాకాణి గోవర్ధన్ ఇంటి వద్ద హై టెన్షన్.. తెలంగాణపై విమర్శలు

అయితే ఎలక్ట్రో ప్లేటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైనట్టు సదరు కంపెనీ చెప్పింది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4. 524 కేజీల మేర తగ్గింది. దీంతో ఈ విషయంలో అవకతవకలు జరిగినట్టు గుర్తించారు అధికారులు. దీంతో ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించింది. ఈ బృందమే ప్రస్తుతం ఈ తాపడాల కేసులో విచారణ సాగిస్తోంది. అందులో భాగంగానే శబరి తంత్రి రాజీవరు అరెస్టు జరిగినట్టు తెలుస్తోంది.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×