E-Paper
Advertisement

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ
Advertisement

Weather Updates:  మే గడిచిపోయింది.. జూన్ వచ్చేసింది.. అయినా ఎండలు ఏ మాత్రం తగ్గలేదు. రాత్రయితే ఒక్కటే ఉక్కుపోత. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చల్లటి కబురు మోసుకొచ్చింది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది.

ఆలస్యమైనా చల్లటి కబురు చెప్పిన ఐఎండీ

Advertisement

జూన్ వచ్చేసింది.. దేశంలో ఇంకా ఎండలు మండిపోతున్నాయి. మే చివరి నాటికి రుతుపవనాలు వస్తాయని భారత వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. అది కాస్త జూన్ మొదటి వారానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. రాబోయే రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది.

అంతా అనుకున్నట్లుగా జరిగితే జూన్ నాలుగు లేదా ఐదున రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలు లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించడానికి పరిస్థితులు ఏర్పడినట్టు తెలిపింది.

Advertisement

నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!

నైరుతి, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాల్లోకి రుతుపవనాలు ఎంటర్ కావచ్చని అంచనా వేసింది. గతవారం సవరించిన అంచనాలు ఈ సీజన్‌లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని ఆ శాఖ తెలిపింది.

తక్కువ వర్షపాతం నమోదవడానికి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కారణంగా చెబుతోంది. దీనివల్ల దేశంలో రుతుపవనాల సమయంలో వర్షపాతం తగ్గుతుందన్నది ఐఎండి మాట. జూన్‌లో ఎల్ నినో పరిస్థితులు బలహీనపడి సెప్టెంబర్‌లో మధ్యస్థం నుంచి బలంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

ALSO READ: సీఎం కోట్ వేసుకోకూడదా? విమర్శకులకు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్

మరోవైపు దేశంలో ఎండలు మాత్రం మండిపోతున్నాయి. పగలంతా భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం ఐదు దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో వాతావరణం మారిపోతోంది. రుతుపవనాల ఆలస్యంతో ఉత్తర, మధ్య భారతంలో ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగుతోంది.

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×