E-Paper
Advertisement

Kerala : రేపు కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు.. గతేడాది కంటే ఆలస్యం..

Kerala : రేపు కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు.. గతేడాది కంటే ఆలస్యం..
Advertisement

Kerala : నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించనున్నాయి. శుక్రవారానికల్లా కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ ప్రకటించింది. రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమట గాలులు వీస్తున్నాయి.

గతేడాది జూన్‌ ఒకటినే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కానీ ఈ ఏడాది వారం రోజులపైగా ఆలస్యంగా వస్తున్నాయి. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను తీవ్రరూపం దాలుస్తోంది. ఇది జూన్‌ 5న ఏర్పడింది. బుధవారం నాటికి తీవ్ర తుపానుగా మారిందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని అంచనా వేస్తున్నారు.

Advertisement

రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించనున్నాయి. అరేబియా సముద్రం, లక్షద్వీప్, మాల్దీవులు, కొమరిన్‌ ప్రాంతాలు, నైరుతి, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి ప్రవేశానికి అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ తెలిపింది.

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×