E-Paper
Advertisement

కులగణన లెక్కింపు వ్యవహారం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఆపై కీలక వ్యాఖ్యలు

కులగణన లెక్కింపు వ్యవహారం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఆపై కీలక వ్యాఖ్యలు
Advertisement

Supreme Court: ఎట్టకేలకు కులగణనపై అన్నిఅడ్డంకులు తొలిగిపోయాయి. జనగణనలో కులాల లెక్కింపుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా కుల గణనను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కొట్టివేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

కులగణన లెక్కింపుకు తొలిగిన అడ్డంకులు.. 

Advertisement

బుధవారం కులగణనపై కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని చెప్పింది. ఈ సందర్భంగా కులగణనను వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టేసింది. అయితే ఈ తీర్పు సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం కులగణనపై కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు.

ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని చెప్పింది. ఈ సందర్భంగా కులగణనను వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టేసింది. అయితే ఈ తీర్పు సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వెనుకబాటు తనం గుర్తించే అధికారం ప్రభుత్వానికి ఉందని, పాలసీ మేకింగ్‌ కావడంతో మా జోక్యం ఉండదని తేల్చేసింది.

Advertisement

సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఆపై కీలక వ్యాఖ్యలు

వెనుకబడిన కులాల జనాభా ఎంతమంది ఉన్నారు తెలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వం సంఖ్య తెలుసుకోవడం చాలా అవసరమన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాల్సిందేనన్నారు. జనగణనలో కులగణన వద్దని గుమ్మల సుధాకర్‌ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారణకు వచ్చింది.

పిటిషనర్‌ తరపు న్యాయవాది తమ  వాదనలను కోర్టు ముందు వినిపించారు. కులగణన డేటాను రాజకీయ పార్టీలు, ఏజెన్సీలు తమ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రమాదం ఉందని ఈ సందర్బంగా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అందులో కులాల వారీగా లెక్కలు తీస్తే సమాజంలో విభజన జరిగే అవకాశముందని వివరించారు. దానివల్ల కుల ఆధారిత రాజకీయాలు మరింతగా బలపడతాయని తెలిపారు.

ALSO READ: అల్లుడికి అత్తింటివారు భలే కానుక.. కిలోన్నర వెండి చెప్పులు, వేసుకుంటారా – దాచుకుంటాడా?

జనగణన ప్రధాన ఉద్దేశం.. జనాభా-ఆర్థిక-సామాజిక వివరాల కోసమని, అలాంటప్పుడు కులగణన చేర్చడం అవసరం లేదన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చిందని, కులాల వారీగా లెక్కలు బయటకు వస్తే సమానత్వ భావన దెబ్బతింటుందని తెలియజేశారు.

దీనిపై కేంద్రం తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే కులాల వారీగా వివరాలు ఉండాల్సిందేనన్నారు. 1931 తర్వాత కులగణన జరగలేదని, కొత్త డేటా కావాలన్నారు. కులగణన చేయాలా వద్దా అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అందులో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం తగదన్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×