E-Paper
Advertisement

శోభన్ బాబు తన కొడుకును హీరోగా చేయకపోవడానికి కారణం?

శోభన్ బాబు తన కొడుకును హీరోగా చేయకపోవడానికి కారణం?
Advertisement

Shobhan Babu:ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది సెలబ్రిటీలు తమకంటూ ఒక హోదా లభించిన తర్వాత.. తమ వారసులను మళ్లీ అదే ఇండస్ట్రీలో కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మంచి కథలతో తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం కూడా చేస్తారు. అయితే మరి కొంతమంది మాత్రం తమ ఫ్యామిలీని.. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంచడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అలాంటి వారిలో ప్రథమంగా వినిపించే పేరు దివంగత నటుడు శోభన్ బాబు. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమను ఏలిన ఈయన తన అద్భుతమైన నటనతో, అందంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆంధ్ర అభిమానులు ముద్దుగా పిలుచుకునే సోగ్గాడిగా పేరు దక్కించుకున్న శోభన్ బాబుకి ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు. అయినప్పటికీ ఏ ఒక్కరినీ కూడా ఆయన ఇండస్ట్రీకి తీసుకురాలేదు. మరీ ముఖ్యంగా ఆయన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయకపోవడం వెనక అసలు కారణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అందుకే శోభన్ బాబు తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయలేదా?

మరి శోభన్ బాబు తన కొడుకును ఎందుకు ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు అనే విషయానికి వస్తే.. గతంలో నటుడు రాజా రవీంద్ర.. శోభన్ బాబును ఇదే విషయంపై ప్రశ్నించగా.. శోభన్ బాబు ఇలా సమాధానమిచ్చినట్లు రాజా రవీంద్ర ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక శోభన్ బాబు చెప్పిన మాటలపై రాజా రవీంద్ర మాట్లాడుతూ..” ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నేను ఎంతగానో కష్టపడ్డాను.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. సక్సెస్ ఉన్నా కూడా ఒత్తిడి ఎక్కువ అయ్యేది. నేను పడ్డ కష్టాలు నా పిల్లలకు వద్దు..

Advertisement

also read:శోభన్ బాబు తన కొడుకును హీరోగా చేయకపోవడానికి కారణం?

ఆ టెన్షన్ నా పిల్లలకి వద్దు – శోభన్ బాబు

ప్రతి సినిమాకి ముందు ఎంత సూపర్ స్టార్ అయినా సరే టెన్షన్ పడాల్సిందే. ఆ టెన్షన్ నా కొడుకుకి వద్దు. నా పిల్లలు ప్రశాంతంగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. మానసికంగా ఇబ్బంది పడే జీవితం వారికి అసలే వద్దు. అందుకే నేను నా పిల్లల్ని ఇండస్ట్రీకి దూరంగా ఉంచాను” అంటూ తెలిపారట. మొత్తానికైతే సినిమా నటుడి కష్టాన్ని అనుభవించారు కాబట్టే ఆ కష్టం తన పిల్లలకు వద్దని ఆయన తన పిల్లల్ని ఇండస్ట్రీకి దూరంగా ఉంచారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈయన కొడుకు ప్రస్తుతం వ్యాపార రంగంలో స్థిరపడినట్లు సమాచారం.

కన్నుమూసిన శోభన్ బాబు భార్య..

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు శోభన్ బాబు భార్య శాంతకుమారి వయోభారంతో జూలై 9వ తేదీన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇక ఈ విషయం అటు శోభన్ బాబు అభిమానులను, సినీ ప్రముఖులను, నెటిజన్లను కలవరపాటుకు గురి చేసింది. ఆమె మరణానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

Related News

తండ్రి చనిపోయిన రోజే ఆ పని.. ‘రక్తకన్నీరు’ నాగభూషణం లైఫ్‌లో ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు!

తండ్రిని పట్టుకొని ఏడ్చేసిన అఖిల్.. వీడియో వైరల్!

ఆ ఒక్క సినిమా తెచ్చిన తంటా: రూ. 7.35 కోట్ల పెనాల్టీతో చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ కమెడియన్!

తప్పుడు ప్రచారమే వేగంగా వ్యాప్తి చెందుతోందా.. వైరల్ వీడియోపై చిన్మయి ఫైర్!

వరుణ్ తేజ్ వైల్డెస్ట్ కంబ్యాక్ డేట్ ఫిక్స్…వరుస ప్లాపులకి బ్రేక్ పడేనా?

ప్రభాస్ ‘ఫౌజీ’ థియేట్రికల్ డీల్స్ క్లోజ్…దక్కించుకుంది ఎవరో తెలుసా ?

నాగార్జున తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×