E-Paper
Advertisement

మీ దగ్గర రూ.2,000 నోట్లు ఉన్నాయా? ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇలా చేస్తే నేరుగా మీ అకౌంట్‌కే!

మీ దగ్గర రూ.2,000 నోట్లు ఉన్నాయా? ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇలా చేస్తే నేరుగా మీ అకౌంట్‌కే!
Advertisement

RBI Update: రూ.2,000 నోట్ల చలామణిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. మీ దగ్గర ఇంకా రూ.2,000 నోట్లు మిగిలిపోయి ఉంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అవి ఇప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే, వీటిని మార్చుకోవడానికి లేదా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఇప్పటికీ కొన్ని సులువైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.

98 శాతానికి పైగా నోట్లు వెనక్కి

Advertisement

2023 మే నెలలో రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన నాటికి మార్కెట్‌లో రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉండేవి. ప్రస్తుతం అందులో 98.47 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయి. అయితే, ఇంకా రూ.5,451 కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ప్రజల వద్దే ఉండిపోయాయని, వాటిని వెనక్కి తీసుకోవడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ అప్‌డేట్ ఇచ్చింది.

Also Read: ‘సర్’ ప్రక్రియపై సైబర్ ముఠా కొత్త స్కెచ్.. హైదరాబాద్ సీపీ హెచ్చరిక!

Advertisement

నోట్లను మార్చుకోవడానికి సులువైన మార్గాలు

1. మీ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ ప్రధానంగా రెండు పద్ధతులను అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి కౌంటర్లలో మీ నోట్లను నేరుగా మార్చుకోవచ్చు లేదా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేసుకోవచ్చు.

2. ఆర్బీఐ ఆఫీసులకు నేరుగా వెళ్లలేని వారి కోసం ఇది చాలా సులువైన మార్గం. మీ దగ్గరలోని ఏదైనా పోస్టాఫీసుకి వెళ్లి, ఇన్సూర్డ్ పోస్ట్ (ఇన్సూరెన్స్ చేసిన తపాలా) ద్వారా ఆ నోట్లను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపవచ్చు. అవి నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. దీనికోసం మీ ఆధార్, పాన్ కార్డ్ , బ్యాంక్ పాస్‌బుక్ వివరాలను జత చేయాల్సి ఉంటుంది.

సురక్షితంగా మార్చుకోవచ్చు

సాధారణ బ్యాంకుల కౌంటర్లలో ఈ నోట్ల మార్పిడి గడువు ముగిసినప్పటికీ, ఆర్బీఐ కల్పించిన ఈ ప్రత్యామ్నాయాల ద్వారా సామాన్యులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ నోట్లను సురక్షితంగా మార్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కాబట్టి మీ దగ్గర రూ.2,000 నోట్లు ఉంటే ఆలస్యం చేయకుండా పోస్టాఫీసు లేదా ఆర్బీఐ ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

Also Read: ఇరాన్‌పై అమెరికా భీకర వైమానిక దాడులు.. తొలి రెండు రోజుల్లోనే 14 మంది మృతి, 78 మందికి గాయాలు!

Related News

ఎలాన్ మస్క్‌పై భారతీయులు ఆగ్రహం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమల్‌హాసన్, అసలు ఏం జరిగింది?

ఢిల్లీ ఎయిర్‌పోర్టు విమానం లోపలే సీజేపీ నేతలు అరెస్ట్.. ఎమర్జెన్సీ కంటే దారుణమన్న కేజ్రీవాల్

హోటల్ గదిలో కుమ్మేసుకున్నారు.. భర్తని ఆ విధంగా చూసి, చెంప చెళ్లుమనిపించిన భార్య

ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఢిల్లీలో.. నన్ను అరెస్టు చేస్తే, సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

కాళ్లను గొలుసులతో కట్టేసి.. నదిలో నవ దంపతుల మృతదేహాలు!

‘మొత్తం నగరాన్ని బంద్ చేయడం ఏంటి’? ఢిల్లీ లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ.. 26 వేల మంది బలగాల మోహరింపు, లిక్కర్ షాపులు క్లోజ్

భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

Big Stories

Advertisement
×