ఉపా చట్టం కింద ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేయడమోమో గానీ, ఇది పవన్‌కు తగులుకున్నది. ఉపా ఉల్టా తిరిగింది. దేశద్రోహం, ఉగ్రవాదుల నిరోధక చట్టం కిందిఈ ఉపా చట్టాన్ని ప్రయోగించడం ద్వారా రావణ్‌కు బెయిల్ దొరకకుండా చేయాలనేది పవన్ కుట్ర అని ఏపీలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అయితే ఇది మెల్లిమెల్లెగా పవన్ మెడకే తగిలిస్తున్నారు. గతంలో పవన్ మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ .. మరి నీపైన ఎందుకు ఉపా కేసు పెట్టరాదు..? అని నిలదీస్తున్నారు. గతంలో పవన్ పలు ఇంటర్వ్యూలలో తనకు నక్సలైట్ కావాలని కోరిక ఉండేననే విషయం చెప్పుకొచ్చాడు. అంతే కాదు.. మొన్నటి గద్దర్ విషయం కూడా చర్చకు పెట్టారు ఏపీలో.
విప్లవ భావాలున్న గద్దర్‌కు కారును కొనిచ్చానని చెప్పడం, అతను ఓరేయ్ తమ్మీ అని ఆప్యాయంగా పిలుస్తాడని ఇద్దరి మధ్య అనుబంధాలను చెప్పుకునే ప్రయత్నం చేసిన పవన్‌పై ఈ ఉపా చట్టం ఎందుకు పెట్టొద్దని ఏపీకి చెందిన ఓ మహిళ జర్నలిస్టు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. దీనికి ముందే కవిత కూడా పవన్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ గడ్డపై కాలుమోపి ఇక్కడి ప్రాంత వాసులను అవమానపరిచే విధంగా మాట్లాడట0 కాకుండా, వేర్పాటు వాదులంటూ కామెంట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. వేర్పాటు వాదులనే మాట ఎందుకు వచ్చింది..? అని ఆమె నిలదీశారు. మేమేమన్నా ఉగ్రవాదులమా? దేశం నుంచి విడిపోతామని అన్నామా? మా రాష్ట్రం కోసం మేం ఉద్యమం చేశాం.. సాధించుకున్నాం.. అనవసరంగా నీ వ్యాఖ్యలు దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే విధంగా ఉన్నాయని, దేశ ద్రోహం కేసు నీపైనే పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇది అటూ ఇటూ పోయి వపన్‌నే వెంటాడుతున్నాయి. వాస్తవానికి పవన్ వ్యాఖ్యల్లో చాలా సందర్భాల్లో క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదు. చాలా సార్లు సినిమాల్లోగా ఆవేశంగా మాట్లాడటం ఆయన నైజం. సబ్జెక్టు మీద నిలకడగా మాట్లాడటం రాదు. ఆవేశంతో ఊగిపోవడంతో ఆయన ఎప్పుడు ఎలా స్పందిస్తాడో.. ఆయన భావాలు ఎలా ఉంటాయో కూడా పసిగట్టలేరెవరు.
అప్పుడే చేగువేరా అంటే ప్రాణం అంటాడు. ఆయన సిద్దాంతాలు ఆకర్షించాయని చెబుతాడు. మళ్లీ సనాతన ధర్మం కోసం పాదయాత్రలు చేస్తూ ఉంటాడు. రెండు పరస్పర భిన్న అభిప్రాయాలను ఆయన ఏకకాలంలో వెలిబుచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తాడు. ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా అంతే వివాదంగా ఉంటున్నాయి. దీని ద్వారా పవన్‌కు పేరు, ఖ్యాతి తెచ్చిపెట్టడమేమో గానీ, అనవసరమైన రచ్చ చేసి పెడుతున్నాయి. రాజకీయంగా పరిపక్వత లేదనే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి.