E-Paper
Advertisement

విజయ్ మార్క్ బడ్జెట్.. పెళ్లికి బంగారు నాణెం.. పుట్టిన పాపాయికి గోల్డ్ రింగ్!

విజయ్ మార్క్ బడ్జెట్.. పెళ్లికి బంగారు నాణెం.. పుట్టిన పాపాయికి గోల్డ్ రింగ్!
Advertisement

Tamil Nadu Budget 2026: తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన తొలి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ ఈ బడ్జెట్‌ను సభ ముందుంచుతూ అనేక సంక్షేమ పథకాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి  జోసెఫ్ విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో బడ్జెట్ ప్రతులను చదివి వినిపించారు.

మహిళలకు 8 గ్రాముల బంగారం

టీవీకే ప్రభుత్వం తన తొలి బడ్జెట్ లో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసింది. వివాహ సమయంలో మహిళలకు 8 గ్రాముల బంగారం నాణేంతో పాటు ఒక పట్టు చీరను ఉచితంగా అందజేసే నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. పేద మహిళల వివాహాలకు ఆర్థికంగా చేయూతనందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.812 కోట్లను కేటాయించారు.

శిశువులకు బంగారు ఉంగరాలు

Advertisement

ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే చిన్నారుల కోసం ‘తాయ్ మామన్ తంగ మోదిర తిట్టం’ (Thaai Maaman Thanga Modhira Thittam) అనే ప్రత్యేక పథకాన్ని ఆర్థిక మంత్రి విల్సన్ ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి బిడ్డకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించనున్నారు. ఈ సంక్షేమ కార్యక్రమానికి బడ్జెట్‌లో రూ.560 కోట్లను విజయ్ సర్కార్ కేటాయించింది.

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు..

విద్యా రంగానికి కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత లభించింది. ‘వెట్రి మడికణిని తిట్టం’ (Vetri Madikanini Thittam) పథకం కింద కళాశాల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కోసం ఏకంగా రూ.2,000 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. అలాగే పాఠశాల విద్యార్థుల కోసం సైకిళ్లతో పాటు హెల్మెట్లు, బాటిల్ హోల్డర్లను అందించేందుకు రూ.777 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఆ హామీలపై స్పష్టత కరవు..

Advertisement

అయితే ఎన్నికల ప్రచారం సమయంలో విజయ్ ఇచ్చిన కొన్ని కీలక హామీలపై ఈ బడ్జెట్ లో ఎలాంటి ప్రకటన రాలేదు. కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ప్రతి నెలా రూ.2,500, ఏడాదికి ఉచితంగా 6 వంటగ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలపై బడ్జెట్ లో ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం.

Also Read: జీవితంలో కచ్చితంగా చూడాల్సిన.. 7 పుణ్య క్షేత్రాలు.. పాపాలు పోవాలంటే తప్పదు భయ్యా!

రూ.1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యం

తమిళనాడు సమగ్ర ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విజయ్ ప్రభుత్వం బృహత్తర లక్ష్యాన్ని ఈ బడ్జెట్ ద్వారా నిర్దేశించుకుంది. 2036 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.

Also Read: మార్కెట్లోకి All-in-One మిక్సీ.. 1 మిషన్, 10 రకాల పనులు.. హెవీ డ్యూటీకి కేరాఫ్!

Tags

Related News

మోదీ వీడియో డిలీట్ వివాదం.. దెబ్బకు దిగొచ్చిన మెటా.. కేంద్రానికి జుకర్‌బర్గ్ సారీ!

ప్రధాని మోదీ వీడియో డిలీట్ పై.. క్లారిటీ ఇచ్చిన మెటా సంస్థ..!

సీజేపీ నిరసనల్లో ఉగ్ర కుట్ర.. 9 మంది అరెస్ట్, తీగలాగితే డొంక

వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇన్సురెన్స్ లేకపోతే ఆయిల్ బంద్, రంగంలోకి పోలీసులు

కర్ణాటక పరిశ్రమలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి, ఐసీయూలో మరో ముగ్గురు!

పోలీస్ శాఖలో భారీ కుంభకోణం.. నకిలీ ఉద్యోగుల పేరుతో రూ.6.4 కోట్లు అవినీతి

జీతం రూ.63000.. పదో తరగతి ఉంటే చాలు.. ఇండియా పోస్ట్‌లో డ్రైవర్ జాబ్స్

Big Stories

Advertisement
×