Tata EV Discounts August 2026: ఆగస్టు 2026 కు సంబంధించి టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. మోడల్, వేరియంట్ ను బట్టి నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ ఆఫర్లు సహా పలు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్లు ఆగస్టు 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ నెలలో టాటా కర్వ్ EVపై అత్యధిక తగ్గింపు లభిస్తున్నది. అటు నెక్సాన్ EVపై ఇతర మోడళ్లతో పోలిస్తే తక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. టిగోర్ EV, సియెర్రా EVలకు ఈసారి ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించలేదు.
టాటా కర్వ్ EVలో కొన్ని వేరియంట్లపై రూ.3.35 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా పాత నాన్-ఎక్స్ ట్రిమ్ కొనుగోలు చేసే వారికి రూ.3 లక్షల వరకు నగదు తగ్గింపుతో పాటు రూ.35,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్ అందుతోంది. క్రియేటివ్ ట్రిమ్ పై రూ.2.50 లక్షల నగదు తగ్గింపుతో పాటు స్క్రాపేజ్ బెనిఫిట్ కలిపి మొత్తం రూ.2.85 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. కొత్త కర్వ్ X సిరీస్ కొనుగోలు చేసే వారికి కూడా ప్రత్యేక బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.30,000 వరకు బోనస్, స్క్రాపేజ్ ద్వారా రూ.35,000 వరకు పొందవచ్చు. ఇప్పటికే టాటా కారును ఉపయోగిస్తున్న కస్టమర్లకు అదనంగా రూ.30,000 లాయల్టీ బెనిఫిట్ కూడా లభిస్తుంది.
టాటా హారియర్ EVలో అడ్వెంచర్, ఫియర్ లెస్ ప్లస్, ఎంపవర్డ్ ట్రిమ్‌లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.50,000 వరకు, స్క్రాపేజ్ చేస్తే రూ.75,000 వరకు బెనిఫిట్స్ లభిస్తుంది. టాటా ICE కారు నుంచి కొత్త EVకి మారే వారికి రూ.50,000 లాయల్టీ బెనిఫిట్ ఇస్తుండగా, ఇప్పటికే టాటా EV వాడుతున్న వారు మరో కొత్త టాటా EVకి మారితే రూ.1 లక్ష వరకు లాయల్టీ బెనిఫిట్స్ పొందవచ్చు. అదనంగా ‘ఫ్రీడమ్ ఆఫర్’ కింద అడ్వెంచర్ ట్రిమ్‌పై రూ.75,000, మిగిలిన టాప్ వేరియంట్లపై రూ.1 లక్ష వరకు అదనపు తగ్గింపు ఉంది. దీంతో మొత్తం బెనిఫిట్స్ రూ.2.75 లక్షల వరకు చేరనుంది.
టాటా పంచ్ EVపై గరిష్టంగా రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ వేరియంట్లపై నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బెనిఫిట్లు కూడా ఉన్నాయి. కొన్ని వేరియంట్లపై మొత్తం తగ్గింపు రూ.95,000 నుంచి రూ.1.45 లక్షల వరకు ఉంటుంది. టియాగో EVపై కూడా గరిష్టంగా రూ.1.45 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా పాత లాంగ్ రేంజ్ XT వేరియంట్ మీద క్యాష్ డిస్కౌంట్, ఫ్రీడమ్ ఆఫర్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బెనిఫిట్లు కలిపి ఈ మొత్తం బెనిఫిట్స్ లభిస్తాయి. ఇతర వేరియంట్లపై కూడా రూ.65,000 నుంచి రూ.1.25 లక్షల వరకు తగ్గింపులు ఉన్నాయి.
టాటా నెక్సాన్ EVపై ఈ నెలలో గరిష్టంగా రూ.45,000 వరకు మాత్రమే బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ అందుబాటులో ఉన్నాయి.
Read Also: దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!