E-Paper
Advertisement

‘టీడీపీ అంటేనే వెన్నుపోటు పార్టీ’.. దేవరపల్లి వేదికగా జగన్ షాకింగ్ కామెంట్స్!

‘టీడీపీ అంటేనే వెన్నుపోటు పార్టీ’.. దేవరపల్లి వేదికగా జగన్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

YS Jagan: నేడు తూర్పు గోదావరి జిల్లాలో వైసీపి అధినేత జగన్‌మోహన్ రెడ్డి పర్యటించారు.ఈ పర్యటనలో అతను మాట్లాడుతూ.. రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక ఆవేదనతో జంగారెడ్డి గూడెంలో పొగాకు రైతు వెంకటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని, కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా వెళ్లకపోవడం అత్యంత బాధాకరమని విమర్శించారు.

దేవరపల్లి పర్యటనలో బాబు పాలనపై ధ్వజం

Advertisement

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జగన్, అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 27 నెలల పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలూ నష్టపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి స్థానంలో చంద్రబాబు మార్కు విధ్వంసం మాత్రమే కనిపిస్తోందని ఆరోపించారు.

రైతులకు పంటలకు కనీస మద్దతు ధర దక్కడం లేదని, కూటమి ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని ధ్వజమెత్తారు.

Advertisement

వెన్నుపోటు పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం

ప్రభుత్వ లోపాలను, ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి, అరెస్టులు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మార్కు రాజకీయాలు ఎప్పుడూ వెన్నుపోటు పొడిచేలాగే ఉంటాయని, టీడీపీ అంటేనే వెన్నుపోటు పార్టీ అని విమర్శించారు. ఇటువంటి వెన్నుపోటు నైజం వల్ల నేడు సామాన్య ప్రజలు, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన స్పష్టం చేశారు.

Also Read: ‘అబద్దాన్ని మీకన్నా ఎవరూ బాగా చెప్పలేరు’.. చంద్రబాబుపై షర్మిల సెటైర్లు!

Tags

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×