E-Paper
Advertisement

Tamilnadu Sanitary Worker: రోడ్డుపై దొరికిన 45 సవర్ల బంగారం.. పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందంటే?

Tamilnadu Sanitary Worker: రోడ్డుపై దొరికిన 45 సవర్ల బంగారం.. పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందంటే?
Advertisement

Tamilnadu Sanitary Worker: రోడ్డుపై పది రూపాయలు దొరికితే చటుక్కున జేబులో పెట్టుకునే రోజులివి. అలాంటి 45 సవర్ల బంగారం దొరికిందంటే.. ఏం చేస్తామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ తమిళనాడుకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు తన నిజాయితీని నిరూపించుకుంది. రోడ్డుపై చెత్త సేకరిస్తుండగా దొరికిన సుమారు రూ.45 లక్షల విలువైన 45 సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకుంది.

అసలేం జరిగిందంటే?

చెన్నై టీనగర్‌లో పద్మ అనే శానిటరీ వర్కర్ ఆదివారం మధ్యాహ్నం చెత్త సేకరిస్తుండగా.. రోడ్డుపై ఓ బ్యాగు దొరికింది. ఆ బ్యాగ్ ను తెరచి చూడగా అందులో బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే బ్యాగును పాండీ బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించింది పద్మ. పోలీసులు దర్యాప్తులో ఆ బ్యాగు నంగనల్లూర్‌కు చెందిన రమేశ్‌కు చెందినదిగా గుర్తించారు. బ్యాంకుల్లో వేలం వేసే బంగారు ఆభరణాలను పాడుకుని, విక్రయిస్తుంటారు రమేశ్. అలా వేలంలో దక్కించుకున్న ఆభరణాలను తీసుకుని వెళ్తుండగా టీనగర్‌లో పడిపోయాయి. బ్యాగు పడిపోవడంతో ఆయన పాండీ బజార్‌ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇంతలో బంగారు ఆభరణాలు దొరికాయని పద్మ పోలీసులకు తెలిపింది. ఆ నగలను యజమానికి అందజేశారు. నిజాయితీగా నగలను తిరిగి ఇచ్చిన పద్మను పోలీసులు అభినందించారు.

Advertisement

Also Read: సీటు కోసం బస్సులో రచ్చ రచ్చ.. జుట్టు పట్టుకుని కొట్లాడుకున్న వీడియో మీరూ చూసేయండి!

సీఎం ప్రశంసలు

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పద్మ.. నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రశంసిస్తున్నారు. తన నిజాయితీని చాటుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ ప్రశంసించారు. ఆమెకు ప్రశంసించి రూ.లక్ష చెక్కును అందజేశారు.

Related News

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

Big Stories

Advertisement
×