నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే చాలు.. ఆయన అభిమానులు చేసే హడావిడి మామూలుగా ఉండదు. అదే సమయంలో మీమర్స్ కూడా చేతినిండా పని దొరుకుతుంది. సినిమాలోని కొన్ని ఫన్నీ సీన్స్ తీసి మీమర్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. రీసెంట్ గా బాలయ్య నటించిన ‘అఖండ 2’ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రాన్ని చూసేందుకు సాధారణ ప్రేక్షకులతో పాటు ఏకంగా అఘోరీలు, సాధువులు కూడా థియేటర్లకు తరలి వస్తున్నారు. అఘోరీలను థియేటర్లకు రప్పించిన ఘనత బాలయ్య, బోయపాటికే దక్కుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా గురించి బాలయ్య, బోయపాటి కలిసి ఓ హిందీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. వచ్చీరాని హిందీతో హీరో, దర్శకుడు మాట్లాడే మాటలు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. వారి ఇంటర్వ్యూను నెటిజన్లు రీ క్రియేట్ చేసి, ఫన్ పంచుతున్నారు. ఇక ఈ సినిమాలో “నరదృష్టి, పరదృష్టి, అఖండ దృష్టి..” అంటూ బాలయ్య ఓ వ్యక్తిని తలకిందులుగా పట్టుకుని దిష్టి తీసే వీడియో బాగా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ వీడియోను రకరకాలుగా వాడుకుంటూ ఫన్ క్రియేట్ చేస్తున్నారు.
‘అఖండ 2’ సినిమాలో బాలయ్య దిష్టి తీసే సీన్ ను ఓ యువకులు రీక్రియేట్ చేశాడు. పిల్లాడిని ఆడించమని అక్క ఇచ్చిపోతే, తను మాత్రం పిల్లాడిని తలకిందులుగా చేసిన దిష్టి తీస్తున్నట్లు చేస్తాడు. పిల్లాడిని పక్కకు విసిరినట్లుగా చేయగానే, అక్క అతడిని మీదికి చీపురు, చెప్పులు, ఇంట్లోని గిన్నెలను విసురుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చూసి క్రేజీగా ఫీలవుతున్నారు. “బాలయ్య సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “అక్కడ చేతిలో నీకు ఇవాళ మూడినట్టే” అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. “బాలయ్య సినిమాలో చేస్తే బాగుంటుంది. అదే అనుసరించి బయట చేస్తే, వీపు చింతపండు అవుతుంది” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగా ఆకట్టుకుంటుంది. అదే సమయంలో నవ్వు పుట్టిస్తుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య, సంయుక్త మీనన్ జంటగా నటించిన ‘అఖండ 2: తాండవం’ సినిమా డిసెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. బాలకృష్ణతో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ ఈ చిత్రాన్ని తీశారు బోయపాటి. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్స్ చేశాడు. ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. సనాతన ధర్మం, స్పిరిచ్యువల్ థీమ్స్, మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ వీక్ లో కలెక్షన్లు వరల్డ్ వైడ్ గా రూ. 90 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది.
Read Also: డేంజర్ స్టంట్.. పైకి పోవాలని అంత తొందర ఏంట్రా నీకు?