BigTV English

Tamilanadu: మహిళలకు గుడ్‌న్యూస్.. ప్రతీనెలా ఖాతాలోకి రూ. వెయ్యి..

Tamilanadu: మహిళలకు గుడ్‌న్యూస్.. ప్రతీనెలా ఖాతాలోకి రూ. వెయ్యి..

Tamilanadu: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఇంటి పెద్దగా ఉన్న మహిళకు రూ. వెయ్యి పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.


తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ‘‘మగళిర్ ఉరిమై తొగై’’ పథకాన్ని ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని వెళ్లడించారు. సెప్టెంబర్ 15న అన్నాదురై జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న మహిళలు ఈ పథకంతో ఊరట చెందుతారని అన్నారు. ఈక్రమంలో ఈ పథకానికి సంబంధించి బడ్జెట్‌లో రూ. 7 వేల కోట్లను కేటాయించారు. అలాగే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తహిళ సైనికుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచారు.


Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×