BigTV English

Bigg Boss 9 Promo : గుడ్డు దొంగ పరువు తీసిన నాగ్.. చూడాలని ఉందంటూ ఏడ్చేసిన ఇమాన్యూయెల్

Bigg Boss 9 Promo : గుడ్డు దొంగ పరువు తీసిన నాగ్.. చూడాలని ఉందంటూ ఏడ్చేసిన ఇమాన్యూయెల్

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ సీజన్ 9 రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగనుంది అని ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంజన మొదటి నుంచి ఏవో చిలిపి పనులు చేస్తూనే ఉంది. చిలిపి పనులు అనడం కంటే కూడా దొంగతనం అనే మాట కరెక్ట్.


హౌస్ లో ఒకసారి గుడ్డు పోయింది. గుడ్డు పోయినప్పుడు చాలామంది హౌస్ మేట్స్ అంతా కూడా గొడవలు పడ్డారు. అందరూ గొడవలు పడుతుంటే సంజనా మాత్రం సోఫా మీద తీరిగ్గా హ్యాపీగా కూర్చుని ఉండిపోయింది. ఆ విషయంలో హౌస్మేట్స్ ని విసిగించిన కూడా, కొన్ని విషయాల్లో సంజన ను మాత్రం ఆడియన్స్ కూడా సపోర్ట్ చేశారు.

పరువు తీసిన నాగార్జున 

అయితే ఈరోజు విడుదలైన ప్రోమోలో సంజనా పరువు మొత్తం తీసేశారు నాగార్జున. ఒకసారి చేస్తే కామెడీగా ఉంటుంది కానీ పదేపదే అదే చేస్తే బాగోదు అంటూ హౌస్ మేట్స్ అందరం ముందు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు కింగ్.


తనని చూడాలని ఉంది 

ప్రతి ఒక్కరికి కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఒక వ్యక్తిని ఇష్టపడటానికి ఎవరికి ఉండాల్సిన కారణాలు వాళ్లకి ఉంటాయి. ఇమ్మానుయేల్ సెలబ్రిటీ కాకముందే తనకు ఇంస్టాగ్రామ్ లో ఒక అమ్మాయి చాలా పెద్ద మెసేజ్ పెట్టింది అని, తర్వాత నెంబర్ షేర్ చేసుకుని ఇద్దరం మాట్లాడుకున్నాము అని. తన కోసమే విదేశీ చదువులు కూడా ఆపేసి ఉండిపోయింది అని నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఎమోషనల్ గా ఇమ్మానుయేల్ చెప్పాడు.

ఇమ్మానియేల్ చెప్పిన లవ్ స్టోరీ గురించి నాగార్జున కూడా ఎమోషనల్ అయిపోయారు. నీ లవ్ స్టోరీ విన్న తర్వాత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటూ మాట్లాడారు నాగార్జున. అయితే ఇమ్మానియేల్ మరోసారి ఆ లవ్ స్టోరీ ప్రస్తావన తీసుకొచ్చి తనను ఒక్కసారి చూడాలని ఉంది అంటూ మళ్ళీ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు.

Related News

Bigg Boss 9 : ఎలిమినేట్ అయిపోయిన మరో కామనర్, ట్రోఫీ సెలెబ్రిటీలకే అంకితమా?

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Bigg Boss 9: కెప్టెన్సీ కోసం వచ్చిన తిప్పలు, అందరూ కన్నీటి కొళాయిలు ఓపెన్ చేశారు

Bigg Boss 9 Promo2: కళ్యాణ్‌కు రీతూ వెన్నుపోటు.. మళ్లీ కుళాయి ఓపెన్ చేశాడుగా!

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ టాస్క్.. రీతూ చౌదరికి ఏమైంది?

Bigg Boss 9 Promo : బాత్రూంలో బోరున ఏడ్చేసిన తనుజ, కళ్యాణ్ చేసింది కరెక్టా?

Big Stories

×