Redmi Pad 2 Pro vs OnePlus Pad 3 vs Samsung Tab S10 FE | షావోమి కొత్త రెడ్మీ ప్యాడ్ 2 ప్రోను ఇటీవలే లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టాబ్లెట్ ఇప్పుడు వన్ ప్లస్ ప్యాడ్ 3, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 FEతో పోటీ పడుతోంది. మీకు ఏ టాబ్లెట్ బెస్ట్ అని నిర్ణయించడంలో వాటి ఫీచర్స్ ఒకసారి పోల్చి చూద్దాం.
వన్ ప్లస్ ప్యాడ్ 3 ధర భారతదేశంలో రూ.47,999 నుంచి మొదలవుతుంది. రెడ్మీ ప్యాడ్ 2 ప్రో రూ.31,000లో లభిస్తుంది. మరోవైపు శాంసంగ్ ట్యాబ్ S10 FE వై-ఫై మోడల్ ధర రూ.42,999. శాంసంగ్ 5G వెర్షన్లు కూడా అందిస్తుంది.
వన్ ప్లస్ ప్యాడ్ 3లో 13.2-ఇంచ్ పెద్ద LCD డిస్ప్లే ఉంది. ఇది 144Hz సూపర్ ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. రెడ్మీ ప్యాడ్ 2 ప్రో 12.1-ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. దీని రిజల్యూషన్ 2.5K, రిఫ్రెష్ రేట్ 120Hz. శాంసంగ్ ట్యాబ్ 10.9-ఇంచ్ డిస్ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్ ఇస్తుంది.
వన్ ప్లస్ ప్యాడ్ 3లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ ఉంటుంది. ఇది గేమింగ్, ఇతర టాస్క్‌లకు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. రెడ్మీ ప్యాడ్ 2 ప్రోలో ఎంట్రీ-లెవెల్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్ ఉంటుంది. ఇది రోజువారీ టాస్క్‌లకు సరిపోతుంది. శాంసంగ్ ట్యాబ్ లో ఎక్సినోస్ 1580 చిప్‌సెట్ ఉపయోగించబడింది.
వన్ ప్లస్ ప్యాడ్ 3.. 12,140mAh పవర్ బ్యాటరీతో వస్తుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ ప్యాడ్ 2 ప్రో కూడా 12,000mAh బ్యాటరీతో వస్తుంది. కానీ దీని ఛార్జింగ్ స్పీడ్ 33W మాత్రమే. శాంసంగ్ ట్యాబ్ లో 8,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 45W ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వన్ ప్లస్ ప్యాడ్ 3 ఆక్సిజన్ OS 15తో రన్ అవుతుంది. రెడ్మీ ప్యాడ్ 2 ప్రో హైపర్ OS 2ని ఉపయోగిస్తుంది. శాంసంగ్ ట్యాబ్ వన్ UI 7తో రన్ అవుతుంది. మూడు టాబ్లెట్‌ల్లోనూ కెమెరా సెటప్ ఒకే రకంగా ఉంటుంది. ఇవి వీడియో కాల్స్ సాధారణ ఫోటోలకు సరిపోతాయి.
శాంసంగ్ ట్యాబ్ అన్నిటికన్నా తేలికైన, కాంపాక్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. వన్ ప్లస్ ప్యాడ్ 3 అతి పెద్ద, భారీ మోడల్ ట్యాబ్. రెడ్మీ ప్యాడ్ 2 ప్రో సైజు, బరువుల మధ్య మంచి బ్యాలెన్స్ కలిగి ఉంటుంది. వన్ ప్లస్ లేటెస్ట్ వైఫై 7 వంటి కనెక్టివిటీ ఆప్షన్ ఫీచర్లు ఉన్నాయి.
మీకు పవర్, గ్రేట్ స్క్రీన్ కావాలంటే వన్ ప్లస్ ప్యాడ్ 3ని ఎంచుకోండి. పోర్టబుల్ డిజైన్ కావాలంటే శాంసంగ్ ట్యాబ్ S10 FE ని ఎంచుకోండి. బడ్జెట్ ధరలో మంచి టాబ్లెట్ కావాలంటే రెడ్మీ ప్యాడ్ 2 ప్రో బెస్ట్ ఆప్షన్.
Also Read: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!