BigTV English

Terrorist Attacks on Indian Train: రామేశ్వరం కేఫ్‌ తరహాలో రైళ్లపై దాడులకు కుట్ర.. పాక్‌ ఉగ్రవాది వీడియో వైరల్

Terrorist Attacks on Indian Train: రామేశ్వరం కేఫ్‌ తరహాలో రైళ్లపై దాడులకు కుట్ర.. పాక్‌ ఉగ్రవాది వీడియో వైరల్

Terrorist Attacks on Railways in India:  భారత్ లో ఉగ్రవాద చర్యకు పూనుకున్నారు ఉగ్రవాదులు. రామేశ్వరం కేప్ తరహాలోనే , దేశవ్యాప్తంగా ఉగ్రదాడులను పాల్పడేందుకు పథకం రచించినట్లు తెలుస్తోంది. తాజాగా రైళ్లపై దాడులకు పాల్పడాలంటూ స్లీపర్ సెల్స్‌కు ఒక ఉగ్రవాది ఆదేశాలు జారీ చేస్తున్న వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇందులో ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరి అని అని పోలీసులు ట్రెస్ చేశారు. కాగా ఈ వీడియోను ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాయి. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంటున్న ఘోరీ.. పాకిస్థాన్ కి చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ వారి సహాయంతో బెంగుళూరు రామేశ్వరం కేఫ్ లో స్లీపర్ సెల్ ద్వారా పేలుళ్ళకు పాల్పిడినట్లు తెలుస్తోంది.


తాజాగా ఇండియాలోని రైళ్లపై దాడులకు సంబంధించి ఆదేశాలు ఇస్తున్న మూడు నిమిషాల వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఘోరీ ఏమన్నాడంటే.. రైళ్లపై, పెట్రోలియం ఉపయోగించి పైప్ లైన్ దాడులు, ప్రెజర్ కుక్కర్లు ఉపయోగించి, హిందూ నాయకులను టార్గెట్ చేసి వారిపై దాడులు జరపాలని వ్యాఖ్యానించినట్లు ఉంది. ఈడీ, ఎన్ఐఏ ద్వారా భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్ ను వారి ఆస్తులను నిర్వీర్యం చేస్తోందని ఘోర ఈ వీడియోలో పేర్కొన్నారు. తాము ఇండియాకు తిరిగివచ్చి షేక్ చేస్తామని బెదిరించినట్లు ఈ వీడియోలో ఉంది. మూడు వారాల క్రితం టెలిగ్రామ్‌లో ఈ వీడియో విడుదలైనట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి.

Also Read: అలర్ట్.. ‘వందేభారత్’తో సహా 74 రైళ్లు రద్దు.. ఎక్కడెక్కడంటే?


అయితే ఇందులో ఫర్హతుల్లా ఘోరీకి అబూ సుఫియాన్, సర్దార్ సాహబ్, ఫరూ అనే పేర్లు కూడా ఉన్నాయి. భారత్‌లో గతంలో చోటు చేసుకున్న అనేక పేలుళ్ల వెనుక ఘోరీ హస్తం ఉంది.
ఘోరీ ఉగ్రవాదుల హ్యాండ్లర్ అని  ఢిల్లీ పోలీసులు గతంలో తెలిపారు. కొన్ని రోజులు క్రితం పుణె, ఐఎస్ఐఎస్ మాడ్యువల్ కి చెందిన చాలా మంది ఉగ్రవాదులను దేశవ్యాప్తంగా అరెస్ట్ అయిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్పట్లో ఘోరీ పేరును ప్రవేశపెట్టారు. ఇండియాలో ఐఎస్‌ఐ స్లీపర్‌ సెల్స్‌ను నిర్వహిస్తుందని.. దాని ద్వారా దాడులకు యువకులను రిక్రూట్‌ చేస్తోందని అధికారులు గతంలో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా అతడు మరోసారి తెరపై కనిపించడంతో ఇంటలిజెన్స్ వర్గాలు అలర్ట్ అయ్యాయి.

.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×