BigTV English

CM Revanth Reddy: నా కుటుంబం లేదా బంధువులెవరైనా కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే నేనే దగ్గరుండి కూల్చివేయిస్తా : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: నా కుటుంబం లేదా బంధువులెవరైనా కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే నేనే దగ్గరుండి కూల్చివేయిస్తా : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Reaction on KTR Remarks: హైడ్రా కూల్చివేతలపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో ఎప్పటికీ తగ్గేది లేదంటూ తెగేసి చెప్పేశారు. తన ఫస్ట్ ప్రెయారిటీ చెరువులను కాపాడటమేననన్నారు. ఈ విషయంలో ఎవరూ చెప్పినా వినేది లేదన్నారు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతదంటూ ఆయన స్పష్టం చేశారు.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హెడ్రా కూల్చివేతలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సచివాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ‘హైడ్రా కూల్చివేతలపై ఒత్తిళ్లు భారీగానే వస్తున్నాయి. అయినా వాటిని ఎదుర్కొంటాం. అంతే తప్ప వెనక్కి తగ్గేది లేదు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఎవరు నిర్మాణాలు చేసినా కూడా వాటిని కూల్చివేస్తాం. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా కుటుంబ సభ్యులు లేదా బంధువులెవరైనా కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే వాటిని నేనే దగ్గరుండి కూల్చివేయిస్తాను. అంతెందుకు సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా మొదటగా కూల్చివేసింది. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్ లో కేటీఆర్ ఎందుకు పేర్కొనలేదు. నిర్మాణాలకు సర్పంచ్ లు కాదు.. అధికారులే అనుమతి ఇస్తారని కేటీఆర్ కు తెలవదా..? పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు ఈ విషయం కూడా తెలియదా?.

Also Read: మల్లారెడ్డికి అల్లుడికి బిగ్ షాక్..కాలేజీలకు నోటీసులు


విద్యా సంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటివరకైతే హైడ్రా హైదరాబాద్ కు మాత్రమే పరిమితం. బఫర్ జోన్, ఎఫ్టీఎల్, చెరువులు, నాలాల ఆక్రణల తొలగింపునకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాం. 30 ఏళ్ల కింద కట్టిన అక్రమ నిర్మాణాలైనా వాటిపై హైడ్రా చర్యలు తీసుకుంటది. బీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్ధమైతే ఆయన నేతృత్వంలోనే చెరువుల ఆక్రమణలపై నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అక్రమ కట్టడాలపై ప్రజా కోర్టులోనే తేల్చుకుందామంటూ రేవంత్ రెడ్డి అన్నారు. నా కుటుంబ సభ్యులకు చెందిన అక్రమ కట్టడాలు ఉంటే వాటి ఆధారాలు తీసుకురావాలి. నేను కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ కట్టడం అని ఆధారాలతో అక్కడకు వెళ్లాను. కేటీఆర్ కు దమ్ముంటే నా కుటుంబ సభ్యులు లేదా నావి లేదా బంధువులవి అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలతో రావాలి. 111 జీవోపై సుప్రీంకోర్టు, ఎన్జీటీ మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు వెళ్తాం. చెరువులు, కుంటలలోని పలు భవనాలు కట్టుకోవడానికి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. సచివాలయం, జీహెచ్ఎంసీ లాంటి భవనాలకు సంబంధించి సుప్రీంకోర్టు అనుమతి ఉంది. రాయదుర్గంలో కూల్చివేత సరైనదే. ఆ భూమి ప్రభుత్వ భూమే.

Also Read: కవిత బెయిల్ వెనుక.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రుణమాఫీ విషయంలో హరీశ్ రావు చేసిన సవాల్ కు కట్టుబడి లేడు. రాజీనామా చేయకుండా హరీశ్ రావు పారిపోయాడు. ఓడిపోయిన దొంగ హరీశ్ రావు. రుణమాఫీ అనేది నా కమిట్మెంట్. నేను చెప్పాను.. చేసి తీరాను. ఇచ్చినటువంటి హామీలపై మూడు పార్టీలు బహిరంగ చర్చలు జరుపుదాం. అన్ని పార్టీల మేనిఫెస్టోలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి.. వాటిపై చర్చిద్దాం. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. అప్పుడు కూడా ఆయన పారిపోవొద్దు. ఇచ్చిన మాట తప్పకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేశాం’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×