BigTV English

Trains Cancelled: అలర్ట్.. ‘వందేభారత్’తో సహా 74 రైళ్లు రద్దు.. ఎక్కడెక్కడంటే?

Trains Cancelled: అలర్ట్.. ‘వందేభారత్’తో సహా 74 రైళ్లు రద్దు.. ఎక్కడెక్కడంటే?

74 Trains Including Vande Bharat To Be Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్. భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. సెప్టెంబర్‌లో పాల్వాల్ మీదుగా వెళ్లే 74 రైళ్లు రద్దు చేసి ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రధానంగా హజ్రత్ నిజాముద్దీన్, రాణి కమలాపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు గతిమాన్ ఎక్స్ ప్రెస్, ఇతర రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు లోకల్ రైళ్లను సైతం రద్దు చేయనున్నట్లు పేర్కొంది.


పాల్వాల్ రైల్వే స్టేషన్‌లో సెప్టెంబర్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాల్వాల్ రైల్వే స్టేషన్‌ను కొత్తగా ఏర్పాటైన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ స్టేషన్ యార్డకు అనుసంధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పాల్వాల్ స్టేషన్ ‌లో ఈ ఏడాది నుంచి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే పనులు త్వరగా పూర్తి చేసేందుకు పాల్వాల్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగనుంది. రద్దు చేసిన రైళ్లలో వందేభారత్ రైలుతోపాటు మరో 74 రైళ్లు ఉన్నాయి.

రద్దయిన రైళ్లు ఇవే..


హజ్రత్ నిజాముద్దీన్ – రాణి కమలపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 20171/20172 – సెప్టెంబర్ 17

గతిమాన్ ఎక్స్‌ప్రెస్ 12049/12050 – సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు

ముంబై CSMT – అమృతసర్ 11057 – సెప్టెంబర్ 3 నుంచి 15 వరకు

అమృత్‌సర్-ముంబై CSMT 11058 – సెప్టెంబర్ 3 నుంచి 18 వరకు

ఖజురహో-కురుక్షేత్ర 1841 – సెప్టెంబర్ 5 నుంచి 16 వరకు

కురుక్షేత్ర-ఖజురహో 11842 – సెప్టెంబర్ 6 నుంచి 17 వరకు

కోటా-హజ్రత్ నిజాముద్దీన్ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ 12059/12060 – సెప్టెంబర్ 6 నుంచి 17 వరకు

రాణి కమలపాటి-హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ 12155 – సెప్టెంబర్ 5 నుంచి 16 వరకు

హజ్రత్ నిజాముద్దీన్-రాణి కమలపతి ఎక్స్‌ప్రెస్ 12156 – సెప్టెంబర్ 6 నుంచి 17 వరకు

జబల్పూర్-హజ్రత్ నిజాముద్దీన్ మహాకోశల్ ఎక్స్‌ప్రెస్ 12189 – సెప్టెంబర్ 5 నుంచి 16 వరకు

హజ్రత్ నిజాముద్దీన్-జబల్పూర్ మహాకోశల్ ఎక్స్‌ప్రెస్ 12190 – సెప్టెంబర్ 6 నుంచి 17 వరకు

బాంద్రా టెర్మినస్-హజ్రత్ నిజాముద్దీన్ యువ ఎక్స్‌ప్రెస్ 12247 – సెప్టెంబర్ 6, 13

హజ్రత్ నిజాముద్దీన్-బాంద్రా టెర్మినస్ యువ ఎక్స్‌ప్రెస్ 12248 – సెప్టెంబర్ 7, 14

వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ-హజ్రత్ నిజాముద్దీన్ తాజ్ ఎక్స్‌ప్రెస్ 12279/12280 – సెప్టెంబర్ 6 నుంచి 17 వరకు

ఇండోర్-న్యూ ఢిల్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 20957 – సెప్టెంబర్ 6, 8, 11, 13, 15

న్యూఢిల్లీ-ఇండోర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 20958 – సెప్టెంబర్ 7, 9, 12, 14, 16

ఇండోర్-హజ్రత్ నిజాముద్దీన్ స్పెషల్ 09309 – సెప్టెంబర్ 6, 8, 13, 15

హజ్రత్ నిజాముద్దీన్-ఇండోర్ స్పెషల్ 09310 – సెప్టెంబర్ 7, 9, 14, 16

సెప్టెంబర్ 6 నుంచి 17 వరకు రద్దు చేయనున్న లోకల్ ట్రైన్స్ జాబితా..

పల్వాల్-ఘజియాబాద్ 04407, షుకర్‌బస్తీ-పల్వాల్ 04408, షకుర్‌బస్తీ-పల్వాల్ 04410, పల్వాల్-షాకుర్‌బస్తీ 04421, పల్వాల్-షాకుర్‌బస్తీ 04437, న్యూఢిల్లీ-పల్వాల్ 04438, పల్వాల్-పల్వాల్ 04438, పల్వాల్-షకుర్బస్తీ 04445, ఆగ్రా కంటోన్మెంట్-పల్వాల్ 04495, పల్వాల్-ఆగ్రా కంటోన్మెంట్ 04496, ఘజియాబాద్-పల్వాల్ 04912, న్యూఢిల్లీ-కోసి కలాన్ 04916, కోసి కలాన్-న్యూ ఢిల్లీ 04919, పాల్వాల్- న్యూఢిల్లీ 04965, న్యూఢిల్లీ-పల్వాల్ లేడీస్ స్పెషల్ 04966, ఘజియాబాద్-పల్వాల్ 04968.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×