E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మళ్లీ ఫారెస్టులో ఇరుక్కుపోయిన అమర్ ఫ్యామిలీ

Nindu Noorella Saavasam Serial Today December 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మళ్లీ ఫారెస్టులో ఇరుక్కుపోయిన అమర్ ఫ్యామిలీ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మిస్సమ్మ కూర్చున్న చైర్‌ కింద మనోహరి బాంబు పెట్టిందని ఆరు తెలుసుకుంటుంది. వెంటనే వెళ్లి బాంబు తీసేయాలని అంటుంది. దీంతో గుప్త ఆపేస్తాడు. ఆరు ఏడుస్తుంది. ఏంటి గుప్త గారు ఆ బాంబు పేలితే నా చెల్లి.. మా నాన్న, పిల్లలు ఇక్కడున్న వారందరికీ ప్రమాదం.. పెద్ద విధ్వంసమే జరిగిపోతుంది అంటూ ఆరు భయపడుతుంటే.. ఆ విషయం మీకు మేము ముందే చెప్తిమి కదా బాలిక అంటాడు గుప్త. దీంతో ఆరు ఆ ప్రమాదం నుంచి ఎలాగైనా కాపాడాలి గుప్త గారు అంటుంది ఆరు. వద్దు బాలిక అది మనము చేయునది కాదు.. మనం మా లోకానికి బయలుదేరవలెను అని చెప్పగానే.. ఆరు కంగారుగా మా వాళ్లందరినీ ప్రమాదానికి వదిలేసి ఎలా రావాలి గుప్త గారు.. అని ప్రశ్నిస్తుంది. దీంతో గుప్త జరగబోవునది విధికి వదిలివేయవలయును బాలిక అని చెప్పగానే.  లేదు గుప్త గారు.. నాకిచ్చిన మీ అంగుళీకమతో నేను ఈ ప్రమాదాన్ని ఆపేస్తాను.. అనగానే.. గుప్త షాక్‌ అవుతాడు.

వెంటనే ఆరు ఉంగరం పట్టుకుని మంత్రం చదువుతుంది. ఇంతలో గుప్త కోపంగా బాలిక ఆపుము.. మా మాట వినుము విధికి ఎదురు వెళ్లరాదు.. అంటాడు. దీంతో ఆరు ఏడుస్తూ.. వాళ్లను కాపాడలేకపోతే నేను ఉండి వేస్ట్‌ గుప్త గారు అంటుంది. గుప్త మరింత కోపంగా వారి భవిష్యత్తును విధికి వదిలివేయుము.. తక్షణమే నువ్వు మాతో బయలుదేరి మా లోకమునకు రమ్ము అచ్చట రానిచో మా పై ఒట్టు అని గుప్త చెప్పగానే.. ఆరు ఏమోషనల్‌ అవుతూ.. గుప్త గారు ఏంటిది..? మీరు ఒట్టు వేయడం ఏంటి.? అని అడగుతుంది. దీంతో గుప్త నీ మంచి కోరే చెప్తున్నాను బాలిక బయలుదేరుము అనగానే.. గుప్త వెనకాల వెళ్లేందుకు రెడీ అవుతుంది ఆరు ఇంతలో మిస్సమ్మ కడుపులో బిడ్డ పెద్దమ్మ మా అమ్మను కాపాడకుండా వెళ్లిపోతావా..? అంటుంది.

Advertisement

ఆ మాటలు విన్న ఆరు షాక్‌ అవుతుంది. గుప్త గారు.. చూశారా..? నా చెల్లి కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడుతుంది. మీరు ఆ మాటలు విన్నారా..? అనగానే.. కడుపులో బిడ్డ మళ్లీ ఇక్కడ ఉన్న అందరినీ కాపాడకుండా వెళ్తారా..? అంటుంది. దీంతో ఆరు ఏడుస్తూ.. విన్నారా..? గుప్త గారు.. ఇక్కడున్న వాళ్లను కాపాడమంటుంది. ఆ పసిబిడ్డ కోసమైనా మనం అందర్నీ కాపాడాలి గుప్త గారు. ఫ్లీజ్‌ గుప్త గారు.. అని వేడుకుంటుంటే.. ఆ బిడ్డ మృత్యువు ముంగిట ఉన్నది బాలిక.. మృత్యుదేవత ఇచ్చటకు వచ్చునది ఆ బిడ్డ కోసం బాలిక ఇచ్చట మనం నిమిత్తమాత్రుల వలే ఉండవలెను తప్ప విధిని అడ్డగించరాదు.. విధిని అనుసరించుటే సృష్టి నియమం.. అంటూ గుప్త చెప్పగానే.. అదేంటి గుప్త గారు అలా అంటున్నారు.. ఇంకా భూమ్మీదకు రాని ఈ పసిబిడ్డను చూస్తూ చూస్తూ చావుకు అప్పగించి వెళ్లాలా..? నన్ను నోరారా పెద్దమ్మ అని పిలుస్తుంది.. కాపాడమని వేడుకుంటుంది కనికరించండి గుప్త గారు అంటూ ఆరు అడగ్గానే..

సృష్టి నియమాలను దాటి మనం విధికి ఎదురెల్లరాదు అది అసాధ్యం బాలిక మా మాట విని మాతో బయలుదేరుము లేనిచో విధ్వసం కాదు ప్రళయమే వచ్చును అని చెప్పగానే.. కనీసం ఈ టైంలో మా ఆయన కూడా ఇక్క డ లేరు గుప్త గారు.. అనగానే.. ఎవరు  ఉన్ననూ.. లేకున్ననూ ఎవరు దేనిని ఆపలేరు బాలిక  అంటూ గుప్త చెప్పగానే..  ఆరు బయపడుతుంది. తర్వాత అమర్‌ చెప్పడంతో రాథోడ్‌, మనోహరి ఇద్దరూ కలిసి బాంబు కోసం వెతుకుతారు.  మనోహరే బాంబును కనిపెట్టి ఇస్తుంది. బాంబును డిస్‌ కనెక్ట్‌ చేసిన అమర్‌ వెంటనే అందరినీ తీసుకుని సిటీకి బయలుదేరుతారు.. మధ్యలోకి వెళ్లగానే.. ఫారెస్ట్‌లో వర్షం కురుస్తుంది.  దీంతో అమర్‌ కారు బురదలో ఇరుక్కుపోతుంది. అప్పుడే మిస్సమ్మకు డెలివరీ ఫెయిన్స్‌ వస్తాయి. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×