E-Paper
Advertisement

నటి ట్విషా సూసైడ్ కేసు.. మాజీ మహిళా జడ్జిని.. అరెస్టు చేసిన సీబీఐ

నటి ట్విషా సూసైడ్ కేసు.. మాజీ మహిళా జడ్జిని.. అరెస్టు చేసిన సీబీఐ
Advertisement

Twisha Suicide Case: అత్తింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న నటి ట్విషా కేసుకు సంబంధించి గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్విషా అత్త, మాజీ న్యాయమూర్తి గిరిబాల సింగ్ ను భోపాల్ లో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ ను రద్దు చేయడంతో ఇవాళ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరణానికి ముందు ట్విషా శరీరంపై గాయాలు ఉండటం, ఆమెను గిరిబాల మానసికంగా వేధించినట్లు వాట్సప్ చాట్ లో బయటపడటంతో ఈ అరెస్టు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే గిరిబాల అరెస్టుకు సంబంధించి మధ్యప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ప్రశాంత్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. ‘మరణానికి ముందు ట్విషా శరీరంపై 7 గాయాలు ఉన్నాయి. పలు నోటీసులు పంపినప్పటికీ గిరిబాల సింగ్ స్పందించలేదు. ట్విషా శర్మను ఆమె మానసికంగా వేధించినట్లు వాట్సప్ సందేశాలు లభించాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని గిరిబాల సింగ్ ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించింది’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

అంతకుముందు ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు సందర్భంగా బాధిత కుటుంబం తరపు న్యాయవాదులు కీలక విషయాలను కోర్టుకు తెలియజేశారు. ట్విషా తీవ్ర స్థాయిలో మానసిక వేధింపులకు గురయ్యారని పేర్కొన్నారు. వైవాహిక జీవితంలో అనేక కష్టాలు పడ్డారని వాదించారు. మరోవైపు పెళ్లైన తొలి రోజు నుంచే ట్విషాను భర్త సమర్ధ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ వేధించినట్లుగా బాధితురాలి తల్లిదండ్రుల వాంగ్మూలాలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. అంతేకాకుండా ఆధారాలను తారుమారు చేసేందుకు గిరిబాల సింగ్ యత్నించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ ను రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

Also Read: అమ్మబాబోయ్.. ఎకరం ఏకంగా రూ. 237 కోట్లు.. హైదరాబాద్‌లో ఎక్కడంటే?

Advertisement

మరోవైపు ట్విషా భర్త సమర్థ్ సింగ్ ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విషా ఆత్మహత్య తర్వాత 10 రోజుల పాటు పరారీలో ఉన్న సమర్థ్ సింగ్.. గతవారం కోర్టు ఎదుట లొంగిపోయాడు. తల్లి గిరిబాల సింగ్ తో పాటు, సమర్థ్ సింగ్ ప్రస్తుతం తీవ్రమైన వరకట్న వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, మే 12న ట్విషా ఆత్మహత్య చేసుకోగా.. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో సీబీఐ ఈ కేసును స్వాధీనం చేసుకోని సోమవారం (మే 25వ తేదీ) నుంచి దర్యాప్తు ప్రారంభించింది.

Also Read: జియో vs ఎయిర్‌టెల్.. ఒకే ధరతో రూ.3,999 వార్షిక ప్లాన్స్.. రెండింటిలో ఏది బెస్ట్?

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×