Nita Ambani-Vaibhav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) అద్భుతంగా రాణిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ముంబై ఇండియన్స్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడితే రూ.30 కోట్లు ఇస్తామని వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Suryavanshi ) బంపర్ ఆఫర్ ఇచ్చారట ఓనర్ నీతా అంబానీ (Nita Ambani ). ఈ మేరకు బ్లాంక్ చెక్ కూడా రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రూ.30 కోట్లతో పాటు ఓ లగ్జరీ ఫ్లాట్, మాల్దీవులలో ప్రైవేట్ ఐలాండ్ కూడా ఇచ్చేందుకు అంబానీ ఫ్యామిలీ సిద్ధమైందట. ఎలాగైనా సరే వైభవ్ సూర్యవంశీని దక్కించుకునేందుకు అంబానీ ఫ్యామిలీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read: Vaibhav-Parag: వైభవ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బయటపెట్టిన రియాన్ పరాగ్, ఇదిగో షాకింగ్ వీడియో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో ఆరెంజ్ క్యాప్ అందుకున్న వైభవ్ సూర్యవంశీ, ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన కూడా బీభత్సం సృష్టించాడు. ఈ దెబ్బకు క్వాలిఫైయర్ లోకి రాజస్థాన్ రాయల్స్ దూసుకు వెళ్ళింది.. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసిన వైభవ్ సూర్య వంశీ… క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైభవ్ సూర్య వంశీ పేరు మారుమోగుతోంది. ఈ తరుణంలో వైభవ్ సూర్యవంశీ పైన ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఐపీఎల్ సమయానికి అతన్ని ముంబై ఇండియన్స్ లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంతో చర్చలు కూడా జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను రాజస్థాన్ రాయల్స్ కు ఇచ్చి… వైభవ్ ను లాగేసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు 30 కోట్లు వైభవ్ కు ఆఫర్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఒప్పుకోకపోతే.. వేలంలో అయిన వైభవ్ ను దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. వచ్చే సీజన్ వరకు కచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వైభవ్ వస్తాడని వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఇచ్చే కోటి రూపాయలు కాదనుకొని వేలంలోకి వచ్చేందుకే నిర్ణయం తీసుకున్నాడట. రెండు కోట్ల బేస్ ప్రైస్ తో రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడట. నిజంగానే వైభవ్ వేలంలోకి వస్తే ముంబై ఒక్కటే కాదు.. లక్నో, SRH లాంటి ఎన్నో జట్లు అతడి కోసం పోటీపడతాయి. అందుకే 30 కోట్ల ఆఫర్ చేసిందట నీతా అంబానీ. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
Also Read: Abdul Razzaq: PSL అల్లా కంటే పవిత్రమైనది..ఐపీఎల్ అతిపెద్ద ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL
🚨🚨BIG BREAKING 🚨🚨
– Mumbai Indians owner Nita Ambani has offered Vaibhav Suryavanshi ₹30 Crore to play for MI.
– She also offered him a flat in Antilia and a private Island in Maldives.
– A blank cheque is also offered to his parents to make Vaibhav move to MI.
– Vaibhav… pic.twitter.com/LKFsDohUNi— Ishan Ghosh¹⁷🇮🇳 (@PantVerse) May 27, 2026