E-Paper
Advertisement

Aadhaar News: ఆధార్ కీలక అప్‌డేట్.. ఫోన్ లింక్, ఇకపై కార్డు అవసరం లేదు

Aadhaar News: ఆధార్ కీలక అప్‌డేట్.. ఫోన్ లింక్, ఇకపై కార్డు అవసరం లేదు
Advertisement

Aadhaar News: ఆధార్ పేరు చెబితే చాలు చాలామంది భయపడుతుంటారు. సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ- యూఐడీఏఐ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని బెంబేలెత్తుతున్నారు సామాన్యులు. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింకుపై కీలక ప్రకటన చేసింది. ఎక్కడి నుంచైనా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు కీలక అప్‌డేట్

Advertisement

ఆధార్ కార్డు‌కి మొబైల్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి చేసింది కేంద్రం. ఈ విషయంలో బయో మెట్రిక్స్, అడ్రస్ ప్రూఫ్, యూజర్ గుర్తింపు ధ్రువీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మొబైల్ నెంబర్‌కు ఆధార్ లింక్ చేయాలని ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే లింక్ చేశారు.. చేస్తున్నారు కూడా.

ఈ సేవలు మరింత సరళతరం చేయడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎక్కడి నుంచైనా మొబైల్ నెంబర్‌ని అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అందుకోసం త్వరలో కొత్త వ్యవస్థ రానుంది. దీనివల్ల ఆధార్ సేవలను మరింత సులభంగా వినియోగించుకోవడం దీని ఉద్దేశం. జనవరి 28 తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

Advertisement

ఇకపై కార్డు అవసరం లేదు, ఇంటి నుంచి చేసుకోవచ్చు

రిపబ్లిక్ డే వేడుక పూర్తికావడంతో కొత్త ఆధార్ యాప్ అందుబాటులోకి తీసుకురానుంది యూఐడీఏఐ. కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ను ప్రారంభించనుంది. ఆధార్ వాడకాన్ని సులభతరం చేయడానికి ఈ యాప్ రూపొందించింది. అవసరమైన చోటకు వినియోగదారులు వారి ఆధార్ కార్డ్ లేదా ఫోటోకాపీలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుండే వారి మొబైల్ నంబర్, చిరునామాను అప్‌డేట్ చేసుకోవచ్చు.

యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు యాప్ లోపల వివరాలు కనిపిస్తాయి. అవసరమైనప్పుడు వినియోగదారులు తమ ఫోన్‌లో చూపించవచ్చు. ఆధార్‌ ఎవరితోనైనా పంచుకునేటప్పుడు పూర్తి చిరునామా లేదా పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలు దాచవచ్చు. దుర్వినియోగాన్ని తగ్గిస్తుంది.

ALSO READ: భారత్, ఈయూ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

మీ ఫోన్‌లో సురక్షితంగా ఉంటుంది కూడా. ఈ యాప్ Android, iOS వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్ళు, ఇతర ధృవీకరణ ప్రదేశాలలో తనిఖీలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రతి కుటుంబ సభ్యునికి ప్రత్యేక గుర్తింపు పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు.

కొత్త ఆధార్ యాప్‌లో అత్యంత ఉపయోగకరమైంది. ఇంటి నుంచి వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను యాప్ లోపల నేరుగా మార్చుకోగలరు. ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీనికి సంబంధించిన ప్రక్రియను సులభమైన దశల్లో ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×