E-Paper
Advertisement

కేరళం సీఎంగా వీడీ సతీషన్ ఇవాళ ప్రమాణ స్వీకారం, కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

కేరళం సీఎంగా వీడీ సతీషన్ ఇవాళ ప్రమాణ స్వీకారం, కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
Advertisement

Thiruvananthapuram: కేరళంకు కాబోయే ముఖ్యమంత్రి విడి సతీసన్ ప్రమాణ స్వీకారం సోమవారం జరగనుంది.  రాజధాని తిరువనంతపురం‌లోని సెంట్రల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు.

ఆదివారం సాయంత్రం కేరళంకు సీఎం రేవంత్‌‌రెడ్డి

Advertisement

కేరళంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అంతా రెడీ అయ్యింది. దశాబ్దం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ -యూడీఎఫ్ తిరిగి అధికారంలోకి రానుంది. మే 18న అనగా సోమవారం కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ కేరళం రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరువుతున్నాయి. ఆదివారం సాయంత్రం తిరువనంతపురం వెళ్లనున్నారు. కాబోయే ముఖ్యమంత్రి సతీశన్, కాబోయే మంత్రులు ఉదయం 9.45 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.

Advertisement

సీఎంగా వీడీ సతీషన్ ప్రమాణ స్వీకారం, కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు

ఆ తర్వాత గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ సోమవారం ఉదయం 9.55 గంటలకు చేరుకుంటారు. ఆ తర్వాత వీడీ సతీశన్‌తోపాటు మంత్రి వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.సతీసన్‌తో పాటు 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కేరళ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యమంత్రి పదవితోపాటు 11 మంత్రి పదవులను కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉంది. కేబినెట్ పదవులకు సీనియర్ నేతలు రమేష్ చెన్నితాల, సన్నీ జోసెఫ్, మురళీధరన్, తిరువంచూర్ రాధాకృష్ణన్, ఏపీ అనిల్ కుమార్, పీసీ విష్ణునాథ్, ఎం లిజు, చాండీ ఊమెన్, బిందు కృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: సీఎం విజయ్‌పై నాకు కడుపు మంట లేదు.. మౌనం వీడిన నటుడు రజినీకాంత్

మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. మంత్రుల జాబితాను ఆదివారం సాయంత్రం గవర్నర్‌కు అందజేస్తామన్నారు. మంత్రివర్గాన్ని సమర్థవంతమైన యూడీఎఫ్ బృందంగా ఆయన అభివర్ణించారు. కేరళం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగే టీమ్ యూడీఎఫ్ బరిలోకి దింపుతుందన్నారు. గతంలో ప్రకటించిన హామీలను కొత్త ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.

 

Related News

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

Big Stories

Advertisement
×