Bihar Crocodile: బీహార్‌లోని సుపాల్ జిల్లాలో ఒక వరి పొలంలో కనిపించిన ముసలిని ఓ యువకుడు తన భుజంపై వేసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ ఘటన భీమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్‌పూర్ వార్డ్ 14లో శుక్రవారం చోటుచేసుకుంది. అక్కడ ముసలి కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినప్పటికీ వెంటనే ఎలాంటి స్పందన రాకపోవడంతో, స్థానికులు ఆ ముసలి నోటిని తాడుతో కట్టేసి సురక్షితంగా బంధించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ముసలిని పరీక్షించి, అది ఆరోగ్యంగానే ఉందని నిర్ధారించుకున్నాక కోసి నదిలో విడిచిపెట్టారు.
వర్షాకాలంలో నదిలో నీటి మట్టం పెరగడం వల్ల ముసళ్ళు తరచూ పొలాలు, జనావాసాల్లోకి వస్తుంటాయని అధికారులు తెలిపారు. ఇలాంటి సమయాల్లో అడవి జంతువులను సొంతంగా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
పొలంలో మొసలి.. భుజాన వేసుకెళ్లిన రైతు!
బిహార్‌లో అమిత్ కుమార్ అనే రైతు తన పొలంలో కనిపించిన మొసలిని తాళ్లతో బంధించి, భుజాలపై వేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. అటవీ శాఖ కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంతో అతడే ఈ పని చేశాడు. అనంతరం అధికారులు మొసలిని నదిలో… pic.twitter.com/g3PixpDJ87
— BigTV APP (@BigtvApp) August 2, 2026