E-Paper
Advertisement

హోటల్ రూమ్ బుక్ చేస్తున్నారా? పొరపాటున కూడా.. ఈ 5 తప్పులు చేయకండి!

హోటల్ రూమ్ బుక్ చేస్తున్నారా? పొరపాటున కూడా.. ఈ 5 తప్పులు చేయకండి!
Advertisement

Hotel Booking Tips: ఈ రోజుల్లో ఎక్కడికైనా టూర్ వెళ్లాలన్నా, బిజినెస్ పనిమీద వేరే ఊరు వెళ్లాలన్నా.. ముందుగా చేసే పని హోటల్ రూమ్ బుక్ చేసుకోవడం. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో మెుబైల్స్ ద్వారా నిమిషాల్లోనే ఆన్ లైన్ లో హోటల్స్ బుక్ చేసేస్తున్నారు. అయితే, చాలామంది తొందరపాటులో కొన్ని కీలక విషయాలను రూమ్స్ బుకింగ్ సమయంలో పట్టించుకోవడంలేదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత జేబుకు చిల్లు పడటమే కాకుండా, ట్రిప్ లోని ఆనందం ఆవిరవుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి హోటల్ బుక్ చేసుకునేటప్పుడు అస్సలు చేయకూడని ఆ 5 తప్పులు ఏంటో ఈ కథనంలో చూద్దాం.

చెక్-ఇన్, చెక్-అవుట్ టైమ్స్

చాలామంది హోటల్‌కు ఏ సమయానికి వెళ్లినా రూమ్ ఇచ్చేస్తారని అనుకుంటారు. కానీ ప్రతి హోటల్‌కు ఒక నిర్దిష్టమైన చెక్-ఇన్ (మ. 12 లేదా 2 గంటలు), చెక్-అవుట్ (ఉ.11 గంటలు) టైమింగ్స్ ఉంటాయి. ఒకవేళ తెల్లవారుజామునే హోటల్‌కు చేరుకుంటే మధ్యాహ్నం వరకు వేచి ఉండమనే ఛాన్స్ ఉంది. లేదంటే అదనపు ఛార్జీలు అడగొచ్చు. కాబట్టి బుకింగ్ చేసే ముందే వారి టైమింగ్స్.. మీ ప్రయాణ సమయానికి సరిపోతాయో లేదో చెక్ చేసుకోవడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

ధరలను కంపేర్ చేయకపోవడం

Advertisement

కొందరు ఆన్ లైన్ లో రూమ్ నచ్చగానే వెంటనే బుక్ చేసేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు. వేర్వేరు ట్రావెల్ యాప్స్ (MakeMyTrip, Agoda, Booking.com).. హోటల్ రూమ్‌కు వేర్వేరు ధరలను, డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంటాయి. ఒక్కోసారి హోటల్ సొంత వెబ్‌సైట్‌లో చూస్తే ఇంకా తక్కువ ధరకే రూమ్ దొరికే ఛాన్స్ ఉంది. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ వంటి ఆఫర్లు కూడా అందుబాటులో ఉండొచ్చు. కాబట్టి బుక్ చేసే ముందు రెండు, మూడు ప్లాట్‌ఫామ్స్‌లో ధరలను సరిపోల్చడం మర్చిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

అదనపు ఛార్జీలపై ఫోకస్

ఆన్‌లైన్‌లో చూసేటప్పుడు రూమ్ ధర చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ పేమెంట్ పేజీకి వెళ్లేసరికి ఆ ధర ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనికి కారణం హిడెన్ ఛార్జీలు. జీఎస్టీ (GST), సర్వీస్ ఛార్జీలు, కొన్నిచోట్ల రిసార్ట్ ఫీజులు, వై-ఫై ఛార్జీలు, పార్కింగ్ ఫీజులు విడిగా వసూలు చేస్తారు. బుకింగ్ కన్ఫర్మ్ చేసే ముందే టాక్స్‌లు, అదనపు ఫీజులు అన్నీ కలిపి నెట్ ప్రైస్ (Net Price) ఎంత ఉందో పరిశీలించాలని నిపుణులు హితవు పలుకుతున్నారు.

క్యాన్సిలేషన్ పాలసీ

Advertisement

అనుకోని కారణాల వల్ల ప్రయాణం రద్దయితే.. హోటల్ బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని హోటళ్లు ‘ఉచిత క్యాన్సిలేషన్’ (Free Cancellation) ఇస్తే.. మరికొన్ని హోటళ్లు ఒక్క రూపాయి కూడా రీఫండ్ ఇవ్వవు. కాబట్టి బుక్ చేసుకునే ముందే క్యాన్సిలేషన్ రూల్స్ ఏంటి? ఒకవేళ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు వెనక్కి వస్తుంది? అనే విషయాలు తెలుసుకుంటే బెటరని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: నగరమంతా జలమయం.. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన స్పైడర్ మ్యాన్.. నెట్టింట హల్ చల్!

అదనపు బెడ్ ఇస్తారా? లేదా?

కొన్ని హోటళ్లలో వయస్సుకు సంబంధించిన కఠినమైన నిబంధనలు అమలు చేస్తుంటారు. ఉదాహరణకు ఒంటరిగా వచ్చే వారికి 18 లేదా 21 ఏళ్లు నిండి ఉండాలనే రూల్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీతో వెళ్లేటప్పుడు చిన్న పిల్లలకు అదనపు బెడ్ ఇస్తారా? లేదా? అనేది ముందే తెలుసుకోవాలి. ఇక వృద్ధులు లేదా దివ్యాంగులు మీతో ఉన్నప్పుడు.. హోటల్‌లో లిఫ్ట్ సదుపాయం, వీల్‌చైర్ యాక్సెస్ (Accessibility) ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేదంటే మెట్లు ఎక్కడం వారికి నరకంగా మారొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: కొత్త పవర్ బ్యాంక్ వచ్చిందోచ్.. 10,000mAh బ్యాటరీ, LED స్క్రీన్.. జెట్ వేగంతో ఛార్జింగ్ ఫుల్!

Related News

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్‌లను ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×