Elon Musk slams Canada hospital: కెనడాలో వైద్య సహాయం అందకపోవడంతో భారత సంతతికి చెందిన ప్రశాంత్ శ్రీకుమార్ మరణించాడు. ఈ వ్యవహారంపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో కెనడా ఆరోగ్య వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా మోటార్ వాహనాల విభాగం సేవలు ఇలాగే ఉంటాయి కామెంట్స్ చేశారు. అసలు మేటరేంటి?
వైద్యం అందక కెనడా ఆసుపత్రిలో భారతీయుడి మృతి
కెనడాలో నివాసం ఉంటున్నారు ప్రశాంత్ శ్రీకుమార్. సరిగ్గా డిసెంబర్ 22న మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో ఆయనకు చాతీలో నొప్పిరావడంతో వెంటనే గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. మధ్యాహ్నం 12.20 నుండి రాత్రి 8.50 గంటల వరకు ఆసుపత్రిలో ఉండిపోయారు. సకాలంలో సరైన వైద్యం అందలేదు.
ఛాతీ నొప్పి గురించి పదే పదే ఫిర్యాదు చేసినా అక్కడి సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆయన బీపీ అమాంతంగా పెరగడంతో ఆయన అక్కడే మృతి చెందారు. నొప్పి భరించలేక పోతున్నానని ప్రశాంత్ పదే పదే తన తండ్రి చెప్పాడు. ఆయన ఆసుపత్రి సిబ్బందిని వేడుకున్నారు.
కెనడా ఆరోగ్య వ్యవస్థపై ఎలాన్ మస్క్ విసుర్లు
కొద్ది గంటల తర్వాత ఈసీజీ తీసిన సిబ్బంది, భయపడాల్సిన పని లేదని చెప్పి మళ్లీ వెయిటింగ్ రూమ్‌లో కూర్చోబెట్టారు. నొప్పి తగ్గలేదు, చివరకు బీపీ అమాంతంగా పెరిగిపోయింది. నొప్పి నివారణ కోసం కేవలం టైలెనాల్ అనే టాబ్లెట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు సిబ్బంది. సుమారు 8 గంటల తర్వాత చికిత్స కోసం గదిలోకి తీసుకెళ్లారు.
లోపలికి వెళ్లిన కేవలం 10 సెకన్లలో ప్రశాంత్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. నర్సులు కేకలు వేసి ప్రశాంత్‌ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు గుండెపోటుతో ప్రశాంత్ శ్రీకుమార్ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈ ఘటనతో కెనడాలో వైద్య సేవలపై అనుమానాలు మొదలయ్యాయి.
ALSO READ: యూకేను వీడుతున్న ఇండియన్ డాక్టర్లు.. కారణం అదేనా?
కుటుంబసభ్యుల ముందు జరిగిన ఈ విషాదం అందరినీ కంటతడి పెట్టించింది. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి ఈ లోకాన్ని విడిచి పెట్టాడు. కెనడా ఆసుపత్రిలో వైద్యం అందక భారతీయుడి మృతిపై విమర్శలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రియాక్ట్ అయ్యారు.
కెనడా ఆరోగ్య వ్యవస్థపై విరుచుకుపడ్డారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కెనడా ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో దుమ్మెత్తి పోశారాయన. ప్రభుత్వం వైద్య సేవలు అందించలేనప్పుడు, అమెరికా మోటార్ వాహనాల విభాగం సేవల మాదిరిగా ఉంటాయని రాసుకొచ్చారు. ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొనే అమెరికాలో మోటార్ వెహికల్ విభాగం. దాంతో కెనడా ఆరోగ్య వ్యవస్థను పోల్చారు ఎలాస్ మస్క్. మరోవైపు కెనడాలో వైద్య సేవలపై అక్కడి ప్రజలు సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.