E-Paper
Advertisement

Jaahnavi Kandula Case: కందుల జాహ్నవి కేసు.. కీలక పరిణామం, ఫ్యామిలీకి రూ.262 కోట్ల పరిహారం

Jaahnavi Kandula Case: కందుల జాహ్నవి కేసు.. కీలక పరిణామం, ఫ్యామిలీకి రూ.262 కోట్ల పరిహారం
Advertisement

Jaahnavi Kandula Case: ఎట్టకేలకు అమెరికాలో పోలీసు నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబానికి రూ.262 కోట్లు పరిహారం చెల్లించేందుకు సియాటెల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది.

పోలీసు అధికారి నిర్లక్ష్యం.. అమెరికాలో కర్నూలు యువతి మృతి

Advertisement

ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి ఉన్నత చదువుల కోసం ఐదేళ్ల కిందట అమెరికా వెళ్లింది. 2021లో జాహ్నవి అక్కడ అడుగు పెట్టంది. నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీలో చేరింది ఆమె. అయితే రెండేళ్ల తర్వాత అంటే 2023 జనవరి 23న రాత్రి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఆమెని బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు కారణమైన పోలీసు అధికారి.. జాహ్నవి మృతిపై రకరకాల కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఓ సాధారణ వ్యక్తి మరణానికి విలువ లేదంటూ అధికారి మాటలు ఆయన బాడీ కెమెరాలో రికార్డయ్యాయి.

Advertisement

ఆమె ఫ్యామిలీకి రూ.262 కోట్ల పరిహారం

కేవలం 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని నవ్వాడు కూడా. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అంతేకాదు భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కూడా. పోలీసు అధికారి తీరుపై స్వదేశంలోనూ విమర్శలు జోరందుకోవడంతో ఆయన్ని విధుల నుంచి తొలగించింది అక్కడి ప్రభుత్వం. ప్రమాదం జరిగిన ప్రాంతం 40 kph జోన్‌లో ఉండగా, కెవిన్‌ వాహనం అతి వేగంతో జాహ్నవిని ఢీ కొట్టింది.

ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబానికి 29 మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించేందుకు సియాటెల్‌ ఒప్పందం కుదిరింది. భారత కరెన్సీలో దాదాపు రూ.262 కోట్లు అన్నమాట. ఈ మేరకు ఆ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

ALSO READ: సూపర్ సిక్స్.. సూపర్ ప్లాప్..  వైసీపీ వాకౌట్ సిగ్గుచేటు

జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరమని, సెటిల్మెంట్‌తో ఆమె కుటుంబానికి కాస్త ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నట్లు సియాటెల్‌ అటార్నీ తన ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై జాహ్నవి కుటుంబం నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. పరిహార కోసం ఇరుపక్షాలు గతవారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేసిన విషయం తెల్సిందే.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×