Racist Attacks: విదేశాల్లో నివాసం ఉన్నవారు.. భారతీయ స్టూడెంట్లపై జాత్యహంకార దాడులు కొనసాగుతున్నాయా? భారతీయులను లక్ష్యంగా చేసుకుని కొన్ని ప్రాంతాల్లో ఆ తరహా ఘటనలు జరుగుతున్నాయా? పైన కనిపిస్తున్న ఫోటో దానికి సంబంధించినదేనా? అసలు మేటరేంటి? ఎక్కడ జరిగింది? అనే వివరాల్లోకి ఓసారి వెళ్లొద్దాం.
భారతీయులపై జాత్యహంకార దాడులు
ఐర్లాండ్‌లో ఓ ఫుడ్ బ్యాంక్ వద్ద తీసిన ఫొటో అక్కడున్న భారతీయులపై జాత్యహంకార దాడులకు కారణమైంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆ సమస్యపై ఒక వార్తా కథనం ప్రచారమైంది. దీన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రచారానికి దారి తీయడం భారతీయులను ఆందోళన కలిగిస్తోంది.
ఐర్లాండ్‌లోని కాల్వే యూనివర్సిటీలో స్పెయిర్ స్టూడెంట్ ప్యాంట్రీ నిర్వహిస్తున్నారు విద్యార్థులు. ఆ ఫుడ్ బ్యాంక్ గురించి ఓ కథనాన్ని ప్రచురించింది ద ఐరిష్ టైమ్స్. తమ దేశంలో పెరిగిన ధరల వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను రాసుకొచ్చింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోలో వైరల్ అయ్యింది.
ఫుడ్ బ్యాంక్ ఫొటోతో ఆన్‌లైన్‌లో దుమారం
ఫుడ్ బ్యాంక్ వద్ద వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు క్యూలో ఉన్నారు. కొందరు వ్యక్తులు ఈ ఫొటోలోని భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. స్పైయిర్ విద్యార్థి పాంట్రీని మొదట డోనెగల్ విద్యార్థి ఆడమ్ ముల్లిన్స్ స్థాపించాడు. సూపర్ మార్కెట్ల నుండి మిగులు ఆహారాన్ని విద్యార్థులకు పంపిణీ చేస్తుంది.
ఆ పాంట్రీ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తోంది. వందలాది మంది విద్యార్థులకు భోజనం అందించే పాంట్రీ కొనసాగుతోంది. విశ్వవిద్యాలయం, దాని విద్యార్థి సంఘాలు ముందుకొచ్చాయని నివేదిక చెబుతోంది. ఉచిత ఆహారం కోసం విదేశీ విద్యార్థలు క్యూ కడుతున్నారని, భారతీయులను ఇక్కడి నుంచి పంపించి వేయాలని ఎక్స్ వేదికగా కొందరు రాసుకొచ్చారు.
ALSO READ: మండుతోన్న మెక్సికో.. డ్రగ్స్ లీడర్ ఎన్‌కౌంటర్‌తో అల్లర్లు
ప్రభుత్వ వ్యవస్థలను దోచుకుంటున్నారంటూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆ ఫుడ్ బ్యాంక్.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు సాయం అందజేస్తోంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి కేవలం భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆ తరహా దుష్ప్రచారం చేస్తున్నారు కొందరు వ్యక్తులు. కొన్నాళ్లుగా ఐర్లాండ్‌లో భారతీయులపై భౌతిక దాడులు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఆ విధంగా ప్రచారం చేయడంపై మండిపడుతున్నారు. ఇలాంటి దాడుల నేపథ్యంలో ఐర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయుల వ్యక్తిగత భద్రతపై పలు సూచనలు చేసింది. భారతీయులు జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లవద్దని పేర్కొంది కూడా.
𝗨𝗻𝗶𝘃𝗲𝗿𝘀𝗶𝘁𝘆 𝗼𝗳 𝗚𝗮𝗹𝘄𝗮𝘆 𝗳𝗼𝗼𝗱 𝗯𝗮𝗻𝗸 𝗳𝗼𝗿𝗰𝗲𝗱 𝘁𝗼 𝘁𝘂𝗿𝗻 𝗮𝘄𝗮𝘆 𝗵𝘂𝗻𝗱𝗿𝗲𝗱𝘀 𝗼𝗳 𝘀𝘁𝘂𝗱𝗲𝗻𝘁𝘀 𝗲𝗮𝗰𝗵 𝘄𝗲𝗲𝗸
Students access the service via a lottery system as demand outstrips supply
This is an example of what’s going on throughout the… pic.twitter.com/ScYId3WEdX
— Frank Conway (@FrankConway2025) February 21, 2026