E-Paper
Advertisement

ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న తమిళ సినిమాలు, సిరీస్ లు ఇవే

ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న తమిళ సినిమాలు, సిరీస్ లు ఇవే
Advertisement

This Week Tamil OTT Releases: ఈ వారం ఓటీటీ ప్రియులకు వినోదం పంచడానికి తమిళ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. హారర్ కామెడీ నుండి రొమాంటిక్ థ్రిల్లర్స్ తో పాటు ఆఫీస్ కామెడీ వరకు విభిన్న జానర్లలో ఈ చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. అంతేకాదు వీటిలో చాలా వరకు తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి రావడం తెలుగు ప్రేక్షకులకు కలిసొచ్చే అంశం. మరి ఈ వారం ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్ అవుతున్న ఆ తమిళ చిత్రాలు, సిరీస్‌ల పూర్తి వివరాలు, రిలీజ్ డేట్స్ ఇక్కడ తెలుసుకుందాం.

1. డ్రోన్స్ (Drones)

సిద్ధి ఇద్నాని, అంజలి నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సూపర్ నేచురల్ హారర్-కామెడీ చిత్రం ‘డ్రోన్స్’. ఆర్. రాఘవ్ మిర్దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. మిస్టరీ, కామెడీ అంశాలతో ఆకట్టుకునే ఈ మూవీ 2026 నవంబర్ 20 నుండి Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

2. అన్బిల్ అవన్ (Anbil Avan)

Advertisement

అశోక్ సెల్వన్, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘అన్బిల్ అవన్’. బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం 2026 నవంబర్ 20 నుండి SonyLIV వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీనిని కూడా తెలుగు సహా ఐదు భాషల్లో వీక్షించవచ్చు.
ఆర్. కార్తికేయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొత్తగా పెళ్లైన జంట ఒక హిల్ స్టేషన్‌లో హోమ్‌స్టే ప్రారంభించే క్రమంలో ఎదుర్కొనే అనూహ్య సంఘటనలను చాలా ఇంటెన్స్ గా చూపించారు.

3. హైకూ (Haiku)

ఏగన్, శ్రీదేవి అపల్ల ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ‘హైకూ’. అమ్మాయిల కాలేజ్ లో ఒక అబ్బాయి చదవాల్సి వస్తే ఎదురయ్యే సరదా సన్నివేశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అక్టోబర్ చివరలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 2026 నవంబర్ 20 నుండి Netflix ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను చూడవచ్చు.

4. మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ (Mr & Mrs Office)

Advertisement

ప్రదీప్ ఆంటోనీ, స్మేహా మణిమేగలై జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్’. ఒకే ఐటీ కంపెనీలో పనిచేసే భార్యాభర్తలు, కంపెనీ నిబంధనల కారణంగా తమ పెళ్లి విషయాన్ని దాచిపెట్టి అపరిచితుల్లా నటిస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే కామెడీ కడుపుబ్బ నవ్వించేలా ఉంటుంది. అబ్దుల్ కబీజ్ దర్శకత్వం వహించిన ఈ వీక్లీ సిరీస్ 2026 నవంబర్ 18 నుండి JioHotstar లో తమిళ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also:

నగరంలో నవవధువులే టార్గెట్ ఓటీటీలో దుమ్మురేపుతున్న సైకో థ్రిల్లర్

Tags

Related News

ఇద్దరు భార్యలూ మృతి… శాపం ఉన్న వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్న యువతి… అదిరిపోయే మిస్టరీ థ్రిల్లర్ తెలుగులోనే

అవయవాలు విరిచేసి దారుణ హత్యలు.. రక్తంతో రాసిన రహస్య సందేశాలు… వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్ థ్రిల్లర్ నేటి నుంచే ఓటీటీలో

వందల మంది అమ్మాయిల మధ్య ఒక్కడే అబ్బాయి… ఓటీటీలోకి వచ్చేసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ

అమ్మాయిలే ఈ దెయ్యం టార్గెట్… 15 ఏళ్లుగా హాస్టల్ ను పీడిస్తున్న శాపం… ఓటీటీలో దుమ్మురేపుతున్న హారర్ మూవీ

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ… నేటి యువతకు కనువిప్పు కలిగించే ఎమోషనల్ డ్రామా… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రూ.11 కోట్ల లాటరీ అనుకుంటే ఫ్రిజ్ మాత్రమే వచ్చింది.. అత్తారింట్లో పరువు కోసం అల్లుడి తిప్పలు చూస్తే నవ్వులే

తాగుబోతు అల్లుడు తెచ్చిన తంటాలు… ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి చూస్తున్న కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×