E-Paper
Advertisement

అడవిలోకి వెళ్లి అదృశ్యం… ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ మలయాళం లవ్ స్టోరీ

అడవిలోకి వెళ్లి అదృశ్యం… ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ మలయాళం లవ్ స్టోరీ
Advertisement

Malayalam Romantic Mystery Drama on OTT: రియలిస్టిక్ గా ఉండే కథనాలు, హృదయాన్ని హత్తుకునే ఎమోషన్స్ తో వస్తున్న మలయాళం సినిమాలకు ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రేక్షకులు మలయాళ కంటెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సంగీతం, ప్రకృతి, అంతుచిక్కని మిస్టరీ కలగలిసిన మరో హార్ట్ టచింగ్ మలయాళం రొమాంటిక్ డ్రామా ‘చిరం’ (Chiram) ఎట్టకేలకు డిజిటల్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మలయాళ విలక్షణ నటుడు అనూప్ మేనన్ (Anoop Menon), ఐశ్వర్య మిధున్ కొరోత్ (Aiswarya Mithun Koroth) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సింధు పారడాయిల్, ఎన్. సుధీర్ కలసి దర్శకత్వం వహించారు. 2026 అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, సున్నితమైన కథనం, అద్భుతమైన సంగీతంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక దీని కథ ఏంటి ? ఏ ఓటీటీలో చూడచ్చో తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే..

ఈ సినిమా కథ విశ్వభారతి యూనివర్సిటీలో బావుల్ సంగీతం గురించి రీసెర్చ్ చేయడానికి వెళ్లిన సీత అనే మలయాళీ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. అక్కడ తనకు సామ్ అనే ఒక ఫోటోగ్రాఫర్ పరిచయమవుతాడు. ఇద్దరి అభిరుచులు కలవడంతో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత సీత తన రీసెర్చ్‌లో భాగంగా బావుల్ జీవనశైలికి, గిరిజనుల జీవితాలకు ఉన్న పోలికలను తెలుసుకోవడానికి సామ్‌తో కలిసి కేరళలోని ఒక గిరిజన ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ ఉన్న ఒకే ఒక్క టీచర్ ఉండే స్కూల్‌లో పరిస్థితుల వల్ల తనే టీచర్‌గా మారి పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెడుతుంది.

Advertisement

అలా సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో ఒక ఊహించని మలుపు వస్తుంది. పని మీద బెంగాల్‌లోని మహానంద అడవులకు వెళ్లిన సామ్ తిరిగి రాడు. మరోవైపు సీత దగ్గర చదువుకుని డాక్టరేట్ పూర్తి చేసిన ఒక గిరిజన అమ్మాయి తిరిగి వచ్చి, బయటి ప్రపంచంలో సమాజం కోసం ఇంకా ఎంతో చేయాల్సి ఉందని సీతకు దిశానిర్దేశం చేస్తుంది. దీంతో సీత తన ప్రియుడు సామ్‌ను వెతుక్కుంటూ, తనను తాను తెలుసుకునే ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. అసలు అడవిలోకి వెళ్లిన సామ్ ఏమయ్యాడు? అతని అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? సీత తన ప్రేమికుడిని తిరిగి కలుసుకుందా లేదా? అనేది ఎమోషనల్ గా చూపించారు.

సన్ నెక్స్ట్ (Sun NXT) లో స్ట్రీమింగ్

ఈ మలయాళం రొమాంటిక్ మిస్టరీ డ్రామా సన్ నెక్స్ట్ (Sun NXT) లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన సుమారు ఆరు వారాల తర్వాత 2026 నవంబర్ 20 నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఒరిజినల్ మలయాళం ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ సదుపాయంతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. జయచంద్రన్ అందించిన మెలోడీస్, దట్టమైన అడవుల అందాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

Advertisement

Read Also: వందల మంది అమ్మాయిల మధ్య ఒక్కడే అబ్బాయి… ఓటీటీలోకి వచ్చేసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ

Tags

Related News

ఓటీటీ లవర్స్ కు పండగే పండగ… ఏ జానర్ కావాలో ఛాయిస్ మీదే

ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న తమిళ సినిమాలు, సిరీస్ లు ఇవే

ఇద్దరు భార్యలూ మృతి… శాపం ఉన్న వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్న యువతి… అదిరిపోయే మిస్టరీ థ్రిల్లర్ తెలుగులోనే

అవయవాలు విరిచేసి దారుణ హత్యలు.. రక్తంతో రాసిన రహస్య సందేశాలు… వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్ థ్రిల్లర్ నేటి నుంచే ఓటీటీలో

వందల మంది అమ్మాయిల మధ్య ఒక్కడే అబ్బాయి… ఓటీటీలోకి వచ్చేసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ

అమ్మాయిలే ఈ దెయ్యం టార్గెట్… 15 ఏళ్లుగా హాస్టల్ ను పీడిస్తున్న శాపం… ఓటీటీలో దుమ్మురేపుతున్న హారర్ మూవీ

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ… నేటి యువతకు కనువిప్పు కలిగించే ఎమోషనల్ డ్రామా… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Big Stories

Advertisement
×