E-Paper
Advertisement

ఎవరీ రేష్మా డాన్? బ్యూటీషియన్‌గా పనిచేస్తూ రౌడీయిజం.. చివరికి ఏమైందంటే?

ఎవరీ రేష్మా డాన్? బ్యూటీషియన్‌గా పనిచేస్తూ రౌడీయిజం.. చివరికి ఏమైందంటే?
Advertisement

Reshma Don: హైదరాబాద్‌లో ‘రేష్మా డాన్’గా చెప్పుకుంటూ హల్‌చల్ చేసిన 30 ఏళ్ల రేష్మా బేగం ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. బ్యూటీషియన్‌గా పనిచేస్తూనే మరోవైపు బెదిరింపులు, వసూళ్లతో భయపెట్టడం మొదలుపెట్టింది. చివరికి లంగర్ హౌస్ పోలీసుల చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కపెట్టే స్థాయికి వచ్చింది. అసలు ఎవరీ రేష్మా డాన్..? అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

డబ్బుల కోసం బెదిరింపులు

Advertisement

హషీంనగర్‌కు చెందిన అర్షియా ఖాన్ కుటుంబాన్ని గత వారం రోజులుగా రేష్మా తీవ్రంగా వేధించడం మొదలుపెట్టింది. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులందరినీ చంపేస్తానంటూ బెదిరింపులకు దిగింది. గతంలో బాధితురాలి సోదరుడు మునావర్ హుస్సేన్ ఖాన్ నుంచి పలుమార్లు డబ్బులు తీసుకుందని, అతను బయటకు వెళ్లినప్పుడల్లా వెంబడిస్తూ వేధించేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఫోన్ కాల్స్‌లో అసభ్య పదజాలంతో దూషిస్తూ.. గతంలో సోదరుడిపై దాడికి కూడా పాల్పడిందని ఆరోపించారు. నవంబర్ 19న మరో వ్యక్తితో కలిసి పల్సర్ బైక్‌పై బాధితురాలి ఇంటికి వెళ్లి కూడా బెదిరించింది.

సోషల్ మీడియాలో డాన్ బిల్డప్

Advertisement

2023 నుంచి సుమారు మూడేళ్లుగా రేష్మా ఇంటర్నెట్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై అసభ్యకర వీడియోలు పోస్ట్ చేస్తూ.. తనను తాను డాన్ గా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఆ రీల్స్, పోస్టులతోనే చుట్టుపక్కల వాళ్లను భయపెట్టే ప్రయత్నం చేసింది. బ్యూటీషియన్‌గా కనిపిస్తూనే ఇలాంటి నేరాలకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

అరెస్ట్, విచారణలో బయటపడ్డ నిజాలు

బాధితురాలి ఫిర్యాదు మేరకు లంగర్ హౌస్ పోలీసులు BNS 329(3), 308(4), 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ సహాయంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్‌లోని ఎస్ఎన్ఆర్ గార్డెన్స్ సమీపంలో శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. విచారణలో హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ దహనం కేసులోనూ తన ప్రమేయం ఉందని ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మహిళా ఎస్సై ఆధ్వర్యంలో మహిళా పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. రేష్మాపై ఇంకా ఏమైనా వివాదాలు, కేసులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.

Also Read: ఉత్తరాంధ్ర లోకల్ ఫైట్.. బరిలో హై-ప్రొఫైల్ సతీమణులు!

Tags

Related News

తెలంగాణలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్..?

మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పెయింట్ దుకాణం దగ్ధం

ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా.. ఇలా అప్లై చేసుకోండి, ఇవే కొత్త రూల్స్

తెలంగాణలో బీజేపీ దూకుడు.. వరుసగా 3 రోజులు అగ్రనేతల టూర్లు, షెడ్యూల్ ఇదే!

రేవంత్‌పై విమర్శల ఎఫెక్ట్.. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఫోన్ కాల్.. 23న కీలక భేటీ!

స్క్రిప్ట్ బీఆర్ఎస్‌ది.. ప్రజెంటేషన్ బీజేపీది.. కిషన్ రెడ్డిపై చామల ఫైర్

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువైంది.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ ఫోకస్!

Big Stories

Advertisement
×