E-Paper
Advertisement

60 ఏళ్లు దాటితే టికెట్ అక్కర్లేదా? ‘ఆలోచన’ టీమ్ సర్‌ప్రైజ్!

60 ఏళ్లు దాటితే టికెట్ అక్కర్లేదా? ‘ఆలోచన’ టీమ్ సర్‌ప్రైజ్!
Advertisement

Aalochana Movie:చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలని సాధిస్తుండటంతో ఇపుడు అదే కోవలో మరిన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ఈ క్రమంలోనే ‘ఆలోచన’ అనే మెసేజ్ ఒరియంటెడ్ మూవీ ఇపుడు ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అయిపొయింది.ఇక సినిమా ఈ నవంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.అందులో భాగంగా తాజాగా సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది.

ఈ మేకింగ్ వీడియోలో షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలు, నటీనటుల అనుభవాలు, దర్శకుడు సినిమాను తెరకెక్కించిన విధానం అన్నింటిని చూపించారు. ముఖ్యంగా కుటుంబ బంధాలు, పిల్లలు, తల్లిదండ్రుల మధ్య అనుబంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఒంటరితనం వంటి అంశాలతో ఈ సినిమా రూపొందినట్లు సినిమా అప్ డేట్స్ చూస్తుంటే అర్థమవుతుంది.

Advertisement

ఇక ఈ సినిమాని పి.ఎస్.జె. ఫిలిమ్స్ కో బ్యానర్‌పై ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా సురేందర్ చాచా దర్శకత్వం వహించారు. జి.వి. నారాయణరావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా , సుజనా, అనుపమ స్వాతి, మాధవి, అద్వైక జెస్సీ, హసిత, జెన్నీ, ప్రసాద్ రామ్, నరేంద్ర తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.ఇందులో సీనియర్స్ తో పాటు కొత్తవారు కూడా భాగం కావడం ఇక్కడ విశేషం.

ఇక ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో నిర్మాత ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఆలోచన’ కథపై దాదాపు రెండేళ్లుగా కష్టపడ్డామని తెలిపారు. కథను సిద్ధం చేయడం నుంచి సినిమా పూర్తి చేసే వరకు ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకున్నామని చెప్పారు. దర్శకుడు సురేందర్ చాచా మాట్లాడుతూ.. తన ఆలోచనలకు తగ్గట్టుగా  సినిమా రూపొందించేందుకు నిర్మాతలు ఎంతో సహకరించారని తెలిపారు.ప్రతి ఒక్కరూ సినిమాను తమ సొంత ప్రాజెక్ట్‌లా భావించి పనిచేశారని వివరించారు.

Advertisement

ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడుతూ.. పిల్లలు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిపోవడంతో నగరాల్లో తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్న పరిస్థితులను సినిమాలో చూపించడం మంచి విషయమని అన్నారు. ఇక ఈ సినిమా విషయంలో ఆడియన్స్ ని ఆకట్టుకునేలా క్రేజీ ఆఫర్ అనౌన్స్ చేశారు సురేష్ కొండేటి.

సినిమా టికెట్ ధరను కేవలం రూ.100 మాత్రమే అని అంతేకాకుండా ఎవరైతే 60 ఏళ్ళకి పై బడిన సీనియర్ సిటిజన్లు థియేటర్ వద్ద ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగా సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు.

నటుడు బెన్నీ సుధాకర్ మాట్లాడుతూ.. ఇంతమంది సీనియర్ నటులతో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పగా. హీరోయిన్ అద్వైక జెస్సీ, నటి అనుపమ కూడా తమకు మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలని తెలిపింది.

సాంకేతిక బృందం విషయానికి వస్తే.. టి. సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా, వియాన్ సంగీతం , ఆర్.ఎల్. వర్మ ఎడిటింగ్ ,గిరీష్ దేవాంగ్ ఆర్ట్ డైరెక్టర్‌గా తమ బాధ్యతలని నిర్వహించారు.ఇక పనిచేయగా ఎస్.కె. పిక్చర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, శ్రీధర్ శ్రీ పీఆర్ఓగా వ్యవహరిస్తున్నారు.

ఏది ఏమైనా టికెట్ రేట్ కేవలం వంద రూపాయలు మాత్రమే కాకుండా సీనియర్ సిటిజన్స్ కి మూడు రోజుల పాటు సినిమాని ఉచితంగా ప్రదర్శించడం మెచ్చుకోతగ్గ విషయమే. చూడాలి మరి నవంబర్ 27న థియేటర్ లోకి వస్తున్న ఈ ‘ఆలోచన’ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో !

ALSO READ:ఎల్లో డ్రెస్సులో సందీపా ధర్ గ్లామర్ ట్రీట్..ఆ ఒక్క లైన్‌తో నెట్టింట ట్రెండింగ్!

Tags

Related News

నన్ను క్షమించు.. ఒప్పుకోక తప్పడం లేదు: నభా నటేష్!

స్నానం చేసేటప్పుడు కల్లు ఉప్పు వేసుకొని చేస్తా : సంయుక్త మీనన్!

ఆకాశంలో ఒక తార.. సాత్విక వీరవల్లి రెమ్యూనరేషన్ ఎంతంటే?

2027సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న చిత్రాలివే!

ఎల్లో డ్రెస్సులో సందీపా ధర్ గ్లామర్ ట్రీట్..ఆ ఒక్క లైన్‌తో నెట్టింట ట్రెండింగ్!

కృష్ణతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. అసలు కారణం చెప్పిన డైరెక్టర్!

సమంతకు పుట్టేది కొడుకే 12 ఏళ్ల క్రితమే చెప్పిన జ్యోతిష్యుడు.. వీడియో వైరల్ !

Big Stories

Advertisement
×