Best Korean Web Series 2024 in OTT : కొరియన్ డ్రామాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ముఖ్యంగా ఇండియాలో కొరియన్ వెబ్ సిరీస్ ల హవా ఎక్కువగా నడుస్తోంది. జానర్ తో సంబంధం లేకుండా కొరియన్ డ్రామా అయితే చూసేద్దాం అన్నట్టుగా ఉన్నారు ఓటీటీ లవర్స్. అందులో భాగంగానే 2024లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన కొన్ని బెస్ట్ కొరియన్ డ్రామాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ వెబ్ సిరీస్ లు కేవలం ఎంటర్టైన్ చేయడమే కాకుండా కథ, కథనాలతో చూసిన ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేశాయి. మీరు కూడా కొరియన్ డ్రామాలంటే చెవి కోసుకునే వారే అయితే ఈ సంవత్సరం రిలీజ్ అయిన బెస్ట్ కొరియన్ డ్రామాలు ఏంటో తెలుసుకుందాం పదండి. మరి 2024 నెట్ ఫ్లిక్స్ బెస్ట్ కొరియన్ డ్రామాల లిస్ట్ లో ఏమున్నాయంటే ?
ది టేల్ ఆఫ్ లేడీ ఓకే (The Tale of Lady Ok)
ఈ డ్రామా జోసెయోన్ కాలంలో జరిగిన ఓకే టే యంగ్ అనే ఒక స్లేవ్ గర్ల్ కథ. టే యంగ్ తన గుర్తింపును దాచిపెట్టి, న్యాయ నిపుణురాలిగా మారి, అవసరమైన వ్యక్తులకు సహాయం చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ కథ, కథనం అద్భుతంగా ఉంటాయి. ఆమె గురించి నిజం తెలిశాక ఏం జరిగింది? ఆ పరిస్థితులను ఆ అమ్మాయి ఎలా ఎదుర్కొంది ? అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
లవ్లీ రన్నర్ (Lovely Runner)
ఈ వెబ్ సిరస్ ఓ నవల ఆధారంగా రూపొందింది. ఈ కొరియన్ డ్రామాలో బియోన్ వూ-సియోక్, కిమ్ హే-యూన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ కథ ఒక క్రీడాకారుడి జర్నీ, అతని రొమాంటిక్ లైఫ్ ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
క్వీన్ ఆఫ్ టియర్స్ (Qween of Tears)
ఈ వెబ్ సిరీస్ పెళ్ళయిన జంట సమస్యాత్మక జీవితం ఆధారంగా తెరకెక్కింది. ‘క్వీన్ ఆఫ్ టియర్స్’ అనే ఈ కొరియన్ డ్రామా బంధాల విలువను తెలియజేస్తుంది. అలాగే వెబ్ సిరీస్ ను చూస్తున్నంతసేపు ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన కిమ్ సూ-హ్యూన్, కిమ్ జి-వోన్ తమ పాత్రలకు జీవం పోశారు. ప్రస్తుతం ఈ సిరీస్ కూడా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
Mr. ప్లాంక్టన్ (Mr. Plankton)
ఒక ప్రాణాంతకమైన జబ్బు బారిన పడిన వ్యక్తి, దురదృష్టవంతురాలైన స్త్రీ చుట్టూ తిరిగే కథ ‘Mr. ప్లాంక్టన్’. ఇది రొమాంటిక్ కామెడీ డ్రామా. ఇందులో నటీనటులు వూ దో-హ్వాన్, లీ యో-మిల జంట కడుపుబ్బా నవ్విస్తుంది. అలాగే మనసారా ఏడిపిస్తుంది కూడా. మరి మీరు కూడా ఈ ఏడాది ఈ వెబ్ సిరీస్ లను చూశారా? ఒకవేళ ఇప్పటిదాకా చూడకుండా మిస్ చేసి ఉంటే, తప్పకుండా చూడండి. ముఖ్యంగా కొరియన్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు డోంట్ మిస్.