Dhulipala Best Movies in OTT : నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ళ రీసెంట్ గా పెళ్లి బంధంతో భార్యాభర్తలుగా మారిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో, పలువురు ప్రముఖుల ఆశీర్వాదంతో ఈ లవ్ బర్డ్స్ మూడు ముళ్ళ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే శోభిత హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. మరి ఆమె కెరీర్ బెస్ట్ సినిమాలు, సిరీస్ లు ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసుకుందాం.
రామన్ రాఘవ్ 2.0 (Raman Raghav 2.0)
2016లో వచ్చిన ‘రామన్ రాఘవ్ 2.0’ సినిమాతో శోభితా ధూళిపాళ్ల సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తన మొదటి సినిమాతోనే నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి పెద్ద స్టార్స్‌తో నటించే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. దాదాపు రూ.3.5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.7 కోట్లు వసూలు చేసి, బొమ్మ హిట్టు అన్పించుకుంది. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
గూడాచారి (Goodachari)
2018లో ‘గూడాచారి’ సినిమాతో శోభిత ధూళిపాళ సౌత్ సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఈ తెలుగు సినిమాలో అడవి శేష్ హీరోగా నటించగా, శోభిత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జగపతి బాబు లాంటి స్టార్ నటులు నటించారు. దాదాపు రూ.6 కోట్లతో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది. బాక్స్ ఆఫీసు వద్ద రూ.25 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
కురుప్ (Kuroop)
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కురుప్’. ఇందులో శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటించింది. 2021లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 81 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
మేజర్ (Major)
శోభితా ధూళిపాళ బెస్ట్ సినిమాలలో ‘మేజర్’ కూడా ఒకటి. 2022లో విడుదలైన ఈ చిత్రాన్ని రూపొందించడానికి రూ. 32 కోట్లు ఖర్చు చేయగా, ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
పొన్నియిన్ సెల్వన్ : I, పొన్నియిన్ సెల్వన్ : II (Ponniyin Selvan I), (Ponniyin Selvan II)
సౌత్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రెండు భాగాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అయితే ఈ మూవీ కేవలం తమిళ తంబీలు మాత్రమే ఆదరించారు. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష కూడా నటించారు. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
మంకీ మ్యాన్ (Monkey Man)
బాలీవుడ్, సౌత్‌తో పాటు, శోభితా ధూళిపాళ ఒక అమెరికన్ చిత్రంలో కూడా నటించింది. అదే ఈ ఏడాది విడుదలైన ‘మంకీ మ్యాన్’. ఈ చిత్రానికి దేవ్ పటేల్ దర్శకుడు. అలాగే ఆయన ఇందులో హీరో కూడా. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 10 మిలియన్లు కాగా, దాదాపు 35 మిలియన్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని పీకాక్ టీవీతో పాటు ప్రైమ్ వీడియోలో కూడా చూడవచ్చు.
మేడ్ ఇన్ హెవెన్ (Made In Heaven)
సినిమాలతో పాటు శోభితా వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. ‘మేడ్ ఇన్ హెవెన్’తో వెబ్ సిరీస్ తో ఆమె వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. దీనిని ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
బార్డ్ ఆఫ్ బ్లడ్ (Bard of Blood)
శోభిత రెండవ వెబ్ సిరీస్ ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’. దీనిని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.