OTT Movie : రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలంటే మొదటగా గుర్తుకు వచ్చేది హాలీవుడ్ సినిమాలు మాత్రమే. ఈ సినిమాలలో ఎఫైర్లు సర్వసాధారణంగా ఉంటాయి. అక్కడ వాళ్ళు వీటిని చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఈ విషయాల్లో మన వాళ్లకు కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకనేమో ఆ సినిమాలను చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక అమ్మాయి ఎఫైర్లతో రెచ్చిపోతూ ఉంటుంది. దొరికిన వాడితో ఆ పని కానిస్తూ ఉంటుంది. ఆమె చుట్టూనే మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘బ్లాక్ స్నేక్ మోన్’ (Black Snake Moan). ఈ మూవీకి క్రెయిగ్ బ్రూవర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో క్రిస్టినా రిక్కీ, శామ్యూల్ ఎల్. జాక్సన్, జస్టిన్ టింబర్‌లేక్ నటించారు. ఇందులో మిస్సిస్సిప్పిలోని సమస్యాత్మక స్థానిక మహిళను ఒక వ్యక్తి తన ఇంట్లో బందీగా ఉంచుతాడు. ఆమె రోడ్డు పక్కన తీవ్రంగా గాయపడిఉంటుంది. ఆమెకి ఉన్న నిమ్ఫోమేనియా అనే వ్యాధి నుండి నయం చేసే ప్రయత్నంలో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ మిస్సిస్సిప్పి బ్లూస్ ఉద్యమం గురించి అనేక విషయాలను కలిగి ఉంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
లాజర్స్ తన భార్యతో గొడవ పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆమె తన తమ్ముడితో రిలేషన్ పెట్టుకుంటుంది. ఆమె మీద కోపంతో ఆమెకి ఇష్టమైన వస్తువులను నాశనం చేస్తుంటాడు లాజర్స్ . ఈ విషయం పై తమ్ముడితో కూడా గొడవపడి బాధపడతాడు. మరోవైపు రైన్, తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి లివింగ్ రిలేషన్ లో ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ ఆర్మీకి వెళ్లాల్సి వస్తుంది. రైన్ ను వదిలి ఆర్మీకి వెళ్తాడు బాయ్ ఫ్రెండ్ . ఆ తర్వాత రైన్ డ్రగ్స్ కు అలవాటు పడి, ఎవడితో పడితే వాళ్లతో గడుపుతూ ఉంటుంది. అలా విచ్చలవిడిగా తిరిగి, మానసికంగా కూడా బలహీనంగా తయారవుతుంది. ఒకరోజు ఇలాగే మత్తులో ఉంటే ఒక వ్యక్తి బలవంతం చేస్తూ ఆమెను గాయపరుస్తాడు.
ఆ తర్వాత ఈమెను లాజర్స్ కాపాడి మనిషిలా తయారు చేయాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలోనే ఆమెను తన ఇంట్లో బంధిస్తాడు. అయితే అతనితో కూడా ఆమె అసభ్యంగా ప్రవర్తిస్తుంది. ఆ తర్వాత రైన్ బాయ్ ఫ్రెండ్ ఆర్మీ నుంచి తిరిగి వస్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ పరిస్థితి చూసి బాధపడతాడు. చివరికి రైన్ మామూలు మనిషి అవుతుందా? విచ్చలవిడితనానికే అలవాటు పడుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బ్లాక్ స్నేక్ మోన్’ (Black Snake Moan) అనే ఈ రొమాంటిక్ మూవీని చూడండి.